వీచాట్ బ్యాన్ : ట్రంప్ సర్కారుకు షాక్ 

21 Sep, 2020 15:30 IST|Sakshi

అమెరికాలో వీచాట్ నిషేధం తాత్కాలికంగా నిలిపివేత

వాషింగ్టన్ : అమెరికాలో చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్‌ నిషేధంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో వీచాట్ మేసేజింగ్ యాప్ డౌన్‌లోడ్‌పై విధించిన నిషేధం అమలుకు  అమెరికా కోర్టు బ్రేక్ వేసింది. ఈ నిషేధాన్ని ఆపాలంటూ కాలిఫోర్నియా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులు భావప్రకటనా స్వేచ్ఛపై ఆందోళన రేకెత్తిస్తుందని వ్యాఖ్యానించింది. 

అమెరికాలో 19 మిలియన్ల క్రియాశీల వినియోగదారులున్న వీచాట్ తాజా పరిణామంపై స్పందించేందుకు నిరాకరించింది. అయితే ఈ తీర్పు వీచాట్ కు స్వల్పకాలిక ఉపశమనమని రిచ్‌మండ్ విశ్వవిద్యాలయం న్యాయ ప్రొఫెసర్ కార్ల్ టోబియాస్ వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వం అప్పీల్ చేసి మళ్లీ గెలిచినా, గెలిస్తే, ఆ నిర్ణయాన్ని అప్పీల్ చేయవచ్చన్నారు. రానున్నఅధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవకపోవచ్చనే నమ్మకంతో కేవలం వారు సమయాన్ని కోరుకుంటున్నారన్నారు. చైనాకు చెందిన టిక్‌టాక్, వీచాట్ యాప్‌ల వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉందంటూ ట్రంప్ సర్కారు వాటిని గత ఆదివారం నుంచి నిషేధించిన విషయం తెలిసిందే. అయితే, తాజా పరిణామంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రావాల్సిన నిషేధం అమలకు కొద్ది గంటలముందు కోర్టు ఇచ్చిన ఆదేశాలతో నిలిచిపోయింది. వీచాట్ యాప్ టెక్నాలజీ దిగ్గజం టెన్సెంట్ సంస్థ చైనాకు చెందినది.  (టిక్‌టాక్‌, వీచాట్‌ల బ్యాన్‌.. చైనా స్పందన)

మరిన్ని వార్తలు