నేడు కమల– పెన్స్‌ మాటల యుద్ధం!

7 Oct, 2020 10:30 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా ఎన్నికల్లో ఉపాధ్యక్ష అభ్యర్ధులు కమలా హారిస్, మైక్‌ పెన్స్‌ల మధ్య బుధవారం సాల్ట్‌లేక్‌ సిటీలో జరగనుంది. వైస్‌ ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌లో ఒక  శ్వేతజాతీయేతర, భారతీయ మూలాలున్న మహిళ పాల్గొనడం ఇదే తొలిసారి. ఇందులో కమలదే పైచేయి కావచ్చని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఇక ఉపాధ్యక్ష అభ్యర్ధుల మధ్య ఒక్కసారి మాత్రమే ముఖాముఖి చర్చ జరుగుతుంది. ఇక తొలి ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌ అనంతరం రిపబ్లికన్‌ ట్రంప్‌తో పోలిస్తే డెమొక్రాట్‌ బైడెన్‌కు ఆదరణ పెరిగినట్లు సర్వేలు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ డిబేట్‌లో మాత్రం రిపబ్లికన్‌ పెన్స్‌ సులభంగా పైచేయి సాధిస్తారని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.(చదవండి: అమెరికా అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారు?)

కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కరోనాకు చికిత్స తీసుకుని సోమవారం శ్వేతసౌధానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇక కోవిడ్‌-19 ప్రభావాన్ని తక్కువగా అంచనా వేసి, వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో ట్రంప్‌ సర్కారు విఫలమైందని ఇప్పటికే డెమొక్రాట్లు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. స్వయంగా అధ్యక్షుడే మహమ్మారి బారిన పడటంతో వారికి మరో అవకాశం లభించింది. బైడెన్‌ వలె కమల సైతం ఈ అంశాన్ని డిబేట్‌లో ప్రస్తావించి, మైక్‌ పెన్స్‌ను ఇరుకున పెడతారని ఆమె మద్దతుదారులు అంటున్నారు. (చదవండిఅగ్రరాజ్యంలో ‘కమల’ వికాసం!)

ఆ అవసరం లేదు
ఉపాధ్యక్ష డిబేట్‌లో భాగంగా ప్లెక్సిగ్లాస్‌ బారియర్‌(రక్షణ కవచం) ఉపయోగించాలని కమల టీం అంటుంటే, మైక్‌ పెన్స్‌ బృందం మాత్రం అలాంటి అవసరం లేదంటూ కొట్టిపారేసింది. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంతటి నిర్లక్ష్యం పనికిరాదంటూ అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ డిబేట్‌ నిర్వహించాలని, ఇప్పటికే అధ్యక్ష అభ్యర్థుల ముఖాముఖి తర్వాత ట్రంప్‌కు‌ కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్దారణ కావడం, ఈ కారణంగా జో బైడెన్‌ ఆరోగ్యం సైతం ప్రమాదంలో పడే పరిస్థితి తలెత్తిన విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. దీంతో పెన్స్‌ టీం ఎట్టకేలకు ఇందుకు అంగీకరించింది. (చదవండిప్రేమ, పెళ్లి, అంతలోనే వరుస విషాదాలు..)

చదవండినేనే గెలిచా.. కాదు నేను!

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా