ఉక్రెయిన్‌ని విడిచిపెట్టి వచ్చేయండి!... హెచ్చరించిన యూఎస్‌

23 Aug, 2022 15:27 IST|Sakshi

US Embassy in Kyiv, warning:  రానున్న రోజుల్లో ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు మరిన్ని దాడులకు తెగబడనున్నట్లు సమాచారం. దీంతో యూఎస్‌ ఎంబసీ మరోసారి తమ దేశ పౌరులకు హెచరికలు జారీ చేసింది. ఆగస్టు 24 బుధవారం ఉక్రెయిన్‌ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని రష్యా మరిన్ని దాడులకు దిగనున్నట్లు ప్రాథమిక సమాచారం. అంతేగాదు మరికొద్ది రోజుల్లో ఉక్రెయిన్‌ పౌర మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సౌకర్యాలకు వ్యతిరేకంగా రష్యా దాడులను ప్రారంభించే ప్రక్రియను వేగవంతం చేస్తోందని విదేశాంగ శాఖకు సమాచారం అందింది.

ఈ నేపథ్యంలోనే అమెరికా రాయబార కార్యాలయం పౌరులకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు సురక్షితమైన అందుబాటులో ఉన్న ప్రైవేట్‌ భూ రవాణా సౌకర్యాలను ఉపయోగించి ఉక్రెయిన్‌ నుంచి బయలుదేరమని యూఎస్‌ పౌరులని కోరుతోంది. అదీగాక బుధవారం సోవియట్‌ పాలన నుంచి ఉక్రెయిన్‌ స్వాతంత్య్రం పొందిన రోజు కూడా కావడంతో రాజధాని కీవ్‌ బహిరంగ వేడుకలను నిషేధించింది. ప్రస్తుతం ఉక్రెయిన్‌కి ముప్పు మరింత తీవ్ర స్థాయిలో ఉందని అధ్యక్షడు వ్లాదిమిర్‌ జెలెన్‌ స్కీ కూడా ప్రకటించారు. 

(చదవండి: మృతి చెందిన పుతిన్‌ సన్నిహితుడి కుమార్తెకు ప్రతిష్టాత్మక అవార్డు)

మరిన్ని వార్తలు