US Govt Says : వడ్రంగి పిట్టలు ఇక కనుమరుగైనట్టేనా!

29 Sep, 2021 20:03 IST|Sakshi

వడ్రంగి పిట్ట అంతరించి పోయినట్టు ప్రకటించిన యూఎస్‌ ప్రభుత్వం

వడ్రంగి పిట్టలంటే తెలియని వారుండరు. ముఖ్యంగా పల్లెల్లో స్వేచ్ఛగా విహరిస్తూ సందడి చేస్తుంటాయి. అవి రాత్రి పూట తమ పొడవాటి ముక్కును పదును చేసుకోవటం కోసం చెట్టు బెరడను గీకుతూ ఒక రకమైన శబ్ధం చేస్తుంటాయి. పైగా ఇవి చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా చూపరులను కట్టిపడేసేలా ఉంటాయి. అలాంటి ఈ వడ్రంగి పక్షులు ఇక లేవని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. అసలేం జరిగిందో ఏమిటో తెలుసుకుందామా!

న్యూయార్క్‌: వడ్రంగి పిట్టలాంటి కొన్ని అరుదైన ప్రసిద్ధ పక్షి జాతులు, కొన్ని రకాలైన చేపలతో సహా దాదాపు 23 రకాల జాతులు అంతరించిపోయినట్లు యూఎస్‌ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఈ  23 జాతులు అంతరించిపోయినట్లు మాత్రమే కనుగొన్నట్లు పేర్కొంది. కానీ క్రమంగా మొక్కలు, జంతువులు కూడా అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉందని వన్య ప్రాణి అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ కాలుష్యం, వాతావరణ మార్పులు అవి అంతరించిపోవడానికి ఓ కారణంగా తెలిపారు. భవిష్యత్‌లో ఇలా అంతరించిపోయేది మనకు ఇక సాధారణం కావచ్చని చెబుతున్నారు.

(చదవండి: విమాన సేవలను తిరిగి పునరుద్ధరించండి’)

ఇటీవల దశాబ్దాలుగా అర్కాన్సాస్, లూసియానా, మిసిపిప్పి, ఫ్లోరిడా వంటి ప్రాంతాలతోపాటు ఆఖరికి చిత్తడి నేలలు ఉండే ప్రాంతాల్లో కూడా చేసిన పరిశోధనల్లో వడ్రంగి పిట్టల ఆచూకీ లభించలేదని యూఎస్‌  ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ సర్వీస్ అధికారులు వెల్లడించారు. ఆగ్నేయ యూఎస్‌లోని మొలస్క్‌లు (నత్తలు, పీతలు) ఉండే తాగునీటి సరస్సుల్లో ఎక్కువగా ఈ వడ్రంగి పిట్టలు ఉంటాయని తెలిపారు. చివరిసారిగా ఆ ప్రాంతంలోనే చూసినట్లు యూఎస్ ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ సర్వీస్ జీవ శాస్త్రవేత్త ఆంటోనీ ఆండి ఫోర్డ్‌ పేర్కొన్నారు.  నీటి కాలుష్యం, పక్షుల ఈకల కోసం వాటిని చంపడం, అడవుల నరికివేత తదితర కారణాలతోపాటు మానవ తప్పిదాలే అవి అంతరించిపోవడానికి ప్రధాన కారణమని వెల్లడించారు.

(చదవండి: పాకిస్తాన్‌ వైపుగా వెళ్తున్న గులాబ్‌ తుపాన్‌)

మరిన్ని వార్తలు