అమెరికన్‌లకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌

17 Sep, 2020 08:27 IST|Sakshi

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వంపై ప్రతి పక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న వేళ  ప్రచారానికి ఎక్కడికి వెళ్లిన కరోనా ప్రశ్నలతోనే విపక్షాలు ట్రంప్‌ను నిలదీస్తున్నాయి. ట్రంప్‌ నిర్లక్ష్యం వల్లే అనేకమంది అమెరికన్‌ పౌరులు ప్రాణాలు కోల్పోయారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. దీంతో ట్రంప్‌ సర్కార్‌ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.

వచ్చే ఏడాది జనవరి నాటికి దేశంలోని పౌరులందరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా హెల్త్‌ అండ్‌ హూమన్‌ సర్వీసెస్‌, యూఎస్‌ డిఫెన్స్‌ శాఖలు సంయుక్తంగా రెండు డాక్యుమెంట్లను విడుదల‌ చేశాయి. ఇందులో ట్రంప్‌ సర్కారు వ్యాక్సిన్‌ అందించడానికి చేస్తున్న ప్రణాళికలు, కరోనాను ఎదుర్కోవడానికి  ఎలా సంసిద్ధమవుతుంది అనే విషయాలను వివరించారు. ఇప్పటి వరకు అమెరికాలో 68,25,448 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,01,266 మంది కరోనాతో మరణించారు.  చదవండి: ఏనుగు లేదా గాడిద.. ఎవరిది పైచేయి?!

మరిన్ని వార్తలు