టెక్ దిగ్గజాలకు ఊహించని షాక్?

6 Oct, 2020 14:51 IST|Sakshi

వాషింగ్టన్ : అమెరికాలో టెక్ దిగ్గజ కంపెనీలకు భారీ షాక్ తగలనుంది. ఆపిల్, అమెజాన్ లాంటి దిగ్గజాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల నియంత్రణకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు అమెరికా హౌజ్ కమిటీ తన నివేదకను రూపొందించింది. టెక్నాలజీ రంగంలో పోటీని పరిశీలిస్తున్న డెమొక్రాట్ల నేతృత్వంలోని హౌస్ ప్యానెల్, ఆపిల్,  అమెజాన్ ఆపిల్ ఇంక్ వంటి దిగ్గజాలు మార్కెట్ స్థలాలను సొంతం చేసుకోవడం, వారి వారి స్వంత ఉత్పత్తుల విక్రయాలకే పరిమితం కావడంలాంటి  పద్ధతులకు చెక్ పెట్టేందుకు భారీ సంస్కరణలను ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పోటీ వాతావరణంలో మార్కెట్లో ఆధిపత్యం కోసం ఇవి అమలు చేస్తున్న వ్యూహాల దృష్టి పెట్టింది. డెమొక్రాటిక్ ప్రతినిధి డేవిడ్ సిసిలిన్ నేతృత్వంలోని హౌస్ యాంటీట్రస్ట్ ప్యానెల్ దర్యాప్తు అనంతరం ముసాయిదా నివేదికను సిద్ధం చేసింది.  

అంతేకాదు టెక్ కంపెనీలు తమ డేటాను ఒక వెబ్‌సైట్ నుండి మరొక వెబ్‌సైట్‌లోకి సులభంగా తరలించడానికి అనుమతించే చట్టాన్ని కూడా ఇది సిఫారసు చేసినట్టు సమాచారం. పోటీదారులను అణిచివేసేందుకుఈ కంపెనీలు తమ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని, వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని ఇప్పటికే  సిపిలిన్ చేసిన వ్యాఖ్యలు ఈ అంచనాలకు బలాన్నిస్తున్నాయి. ఈ నివేదిక ఈ వారంలోనే బహిర్గతం కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ నివేదికను అమోదిస్తే అమెరికా టెక్ దిగ్గజ కంపెనీలు ఊహించని పరిమాణాలు తప్పవని నిపుణుల అంచనా. అయితే ఈ నివేదికను ఎంతమంది కమిటీ సభ్యులు ఆమోదిస్తారనేది అస్పష్టం.

కాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  జరిగిన అమెరికా హౌజ్ కమిటీ ప్రత్యేక ఉప కమిటీ విచారణకు అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్, ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, ఆపిల్ సీఈవో టిమ్ కుక్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇటీవల హాజరైన సంగతి  తెలిసిందే.  

మరిన్ని వార్తలు