అమెరికాలో స్వలింగ వివాహాలకు ఓకే

9 Dec, 2022 14:32 IST|Sakshi

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో స్వలింగ వివాహాలను చట్టబద్ధంగా గుర్తించే ప్రక్రియ ఆరంభమైంది. సంబంధిత బిల్లుకు అమెరికా కాంగ్రెస్‌(పార్లమెంట్‌)లోని ప్రతినిధుల సభ గురువారం తుది ఆమోదం తెలియజేసింది. బిల్లుకు మద్దతుగా 258 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 169 మంది ఓటు వేశారు. మొత్తం డెమొక్రాట్లతోపాటు 39 మంది ప్రతిపక్ష రిపబ్లికన్లు కూడా మద్దతు తెలిపారు. మిగతా 169 మంది వ్యతిరేకించారు.

‘రెస్పెక్ట్‌ ఫర్‌ మ్యారేజ్‌ యాక్ట్‌’ అని పిలుస్తున్న ఈ బిల్లు గత నెలలోనే ఎగువ సభ అయిన సెనేట్‌లో ఆమోదం పొందింది. ఇప్పుడు దిగువ సభ సైతం ఆమోదించడంతో ఇక అధ్యక్షుడు జో బైడెన్‌ వద్దకు వెళ్లనుంది. ఆయన సంతకం చేస్తే బిల్లు చట్టరూపం దాలుస్తుంది. స్వలింగ వివాహాల బిల్లుకు ఆధ్యాత్మిక సంస్థలు మద్దతు తెలిపాయి.
చదవండి: బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌ కోసం.. 22 వేల చెట్ల నరికివేతకు హైకోర్టు అనుమతి

మరిన్ని వార్తలు