US-Russia: పుతిన్‌ బిగ్‌ వార్నింగ్‌.. రష్యాకు చుక్కలు చూపిస్తున్న అమెరికా

12 Mar, 2022 08:45 IST|Sakshi

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. యుద్దంపై తాత్కాలిక విరామం అంటూనే రష్యా బలగాలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. ఉక్రెయిన్‌లోని కీలక నగరాలపై బాంబు దాడులు చేపడుతున్న రష్యా.. సైనిక, వైమానిక స్థావరాలనే టార్గెట్‌ చేసుకుంటోంది. 

ఇదిలా ఉండగా.. రష్యాపై అ‍మెరికా మరిన్ని ఆంక్షలు విధించి ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. పుతిన్‌ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. తాజాగా ర‌ష్యా నుంచి సీఫుడ్‌, వొడ్కా, డైమండ్స్ దిగుమ‌తిపై నిషేధం విధిస్తున్న‌ట్లు బైడెన్ తెలిపారు. ప‌లు ర‌కాల వ‌స్తువుల దిగుమ‌తిపై నిషేధం అమ‌ల్లోకి తెస్తూ  ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా.. జీ-7 దేశాలు, యూరోపియన్‌ యూనియన్‌లోని దేశాలు రష్యాకు ఉన్న మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌ అనే హోదాను తొలగించాయి. ఈ నేపథ‍్యంలో రష్యా దిగుమతులపై భారీగా ట్యాక్స్‌లు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. 

మ‌రోవైపు, ఉక్రెయిన్‌పై దాడులను తీవ్రతరం చేస్తామని పుతిన్‌ వార్నింగ్‌ జారీ చేశారు. ఉక్రెయన్‌పై స్పెష‌ల్ ఆప‌రేష‌న్ చేప‌ట్ట‌నున్న‌ట్లు పుతిన్ ప్ర‌క‌టించాడు. కాగా, ఉకక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను రష్యా బలగాలు చుట్టుముట్టాయి.  

మరిన్ని వార్తలు