తైవాన్‌కు మళ్లీ అమెరికా బృందం

15 Aug, 2022 05:13 IST|Sakshi

తైపీ: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ సందర్శనతో రేగిన ఉద్రిక్తతలు చల్లారకమునుపే మరికొందరు అమెరికా ప్రజాప్రతినిధులు ఆదివారం అక్కడ పర్యటించారు. డెమోక్రాటిక్‌ పార్టీ సెనేటర్‌ ఎడ్‌ మార్కీ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ఈ బృందం ఆదివారం రాత్రి 7 గంటలకు తైపీ చేరింది.

ఈ బృందం ఆది, సోమవారాల్లో అక్కడే ఉండి అమెరికా–తైవాన్‌ల సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు తదితర అంశాలపై సీనియర్‌ నేతలతో చర్చలు జరుపనుంది. ఈ బృందం ఈనెల 2వ తేదీన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ పెలోసీ సందర్శనపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గత 12 రోజులుగా తైవాన్‌ చుట్టు పక్కల ప్రాంతాల్లో యుద్ధ విమానాలు, క్షిపణులు, యుద్ధ నౌకలతో విన్యాసాలు జరుపుతోంది.

మరిన్ని వార్తలు