హైట్‌గా ఉండేలా రెండుసార్లు సర్జరీలు..రీజన్‌ వింటే షాక్‌ అవుతారు!

15 Apr, 2023 16:38 IST|Sakshi

ఇటీవల వైద్య విధానంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. దీనికి సాంకేతికత కూడా తోడవ్వడంతో పలు వ్యాధులను సులభంగా నయం చేయగల చికిత్స విధానాలు చాలామటుకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మనషుల్లో కొంత వికృతమైన ఆలోచనల తో వెర్రీ పనులు చేస్తున్నారునే చెప్పాలి.  రూపు రేఖలు దగ్గర నుంచి ప్రతీది మనకు నచ్చినట్లుగా మార్చుకునేలా కాస్మోటిక్‌ శస్త్ర చికిత్సలు అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో యువత ఆ సర్జరీలు ఎంత ఖరీదైనవైనా..లెక్క చేయకుండా చేయించుకోవడానికి రెడీ అయ్యిపోతున్నారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ఎత్తు పెరిగేందుకు అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ చేయించుకున్నాడు. దీని వల్ల పల దుష్పరిణామాలు ఉన్నా కూడా చేయించుకునేందుకు రెడీ అయిపోయాడు. ఇంతకీ ఎందుకోసం అంత రిస్క్‌తో కూడిన శస్త్ర చికిత్స చేయించుకుంటున్నోడో వింటే ఆశ్చర్య పోవడం ఖాయం.

వివరాల్లోకెళ్తే...అమెరికాకు చెందిన 41 ఏళ్ల గిబ్సన్‌ తన ఎత్తు విషయమై చాలా బాధపడుతుండేవాడు. అతను ఐదు అడుగుల ఐదు అంగుళాలు. ఆ ఎత్తు కారణంగానే తనకు గర్లఫ్రెండ్స్‌ లేరని తెగ బాధపడుతుండేవాడు. అందుకోసం అని తన ఘూస్‌లో కొని రకాల వస్తువలు పెట్టుకుని హైట్‌గా కనిపించేందుకు తెగ ప్రయత్నించేవాడు. ఎత్తు పెరిగేలా మందులు వాడటం దగ్గర నుంచి యోగ వరకు అని రకాలుగా ప్రయత్నాలు చేశాడు. ఐతే అవన్నీ ఫెయిల్‌ అవ్వడంతో ఇక ఎత్తు పెరిగేలా కాళ్లకు శస్త్ర చికిత్స చేయించుకోవాలని డిసైడ్‌ అయ్యాడు. వాస్తవానికి గిబ్సన్‌ ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. శస్త్ర చికిత్స కోసం అని తనసంపాదనలో కొంత డబ్బును ఆదా చేయడమే గాక ఉబర్‌ డ్రైవర్‌ కూడా పార్ట్‌ టైం జాబ్‌ చేసి మరికొంత డబ్బును కూడబెట్టాడు.

గిబ్సన్‌ తాను అనుకున్నట్లుగానే 2016లో మొదటి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత మూడు అంగుళాలు పెరిగాడు. దీంతో అతని ఎత్తు ఐదు అడుగుల ఎనిమిది అంగుళాలు పెరిగాడు. అయినప్పటికి ఇంకా ఎక్కువ పెరగాలని రెండోసారి శస్త్ర చికిత్స చేయించుకునేందుకు కూడా సిద్ధమయ్యాడు. మొదటి శస్త్ర చికిత్స మాదిరిగా రెండో ఆపరేషన్‌ ప్రక్రియ అంత సజావుగా జరగలేదు. మరింత ఎత్తు పెరగడం కోసం వైద్యులు అతని ఎముకలు విరిచి దానిపై అయస్కాంత ‍స్క్రూలు వంటి కొన్ని పరికరాలు అమర్చాల్సి రావడమే గాక విపరీతమైన బాధను కూడా అనుభవించాల్సి వచ్చింది. పైగా మొదటి ఆపరేషన్‌కి రూ. 60 లక్షలు ఖర్చు పెట్టగా రెండోదానికి ఏకంగా రూ. 80 లక్షల దాక ఖర్చు చేయాల్సి వచ్చింది.

ఒక పక్క విపరీతమైన బాధలు మరోవైపు అధికంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చినప్పటికీ బాధపడక పోగా తాను జూన్‌ నాటికి 5 అడుగులు పది అంగుళాలు పెరుగుతానని ఆనందంగా చెబుతున్నాడు. అతనికి శస్త్ర చికిత్స చేసిన వైద్యులు కూడా గిబ్సన్‌ చాలా ఆనందంగా ఉన్నాడని, ప్రస్తుతం అతనికో గర్ల్‌ఫ్రెండ్‌ కూడా ఉందని చెబుతుండటం విశేషం. ఏదీఏమైనా ఈ ఎత్తు పెంచే శస్త్ర చికిత్స వల్ల భవిష్యత్తులో పలు దుష్పరిణామాలే గాక కొన్ని రకాల రుగ్మతల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతుండటం గమనార్హం. 

(చదవండి: జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదాపై బాంబు దాడి.. భయంతో పరుగులు.. క్షణాల ముందు వీడియో..)

మరిన్ని వార్తలు