కోవిడ్‌ పేరు చెప్పి రుణం తీసుకున్నాడు...కటకటాల పాలయ్యాడు

27 Oct, 2021 19:49 IST|Sakshi

డుబ్లిన్‌: మనం చాలా రకాలుగా బ్యాంకులను మోసం చేసి బారీగా రుణాలను పొంది ఎగవేతకు పాల్పడిన ప్రముఖుల గురించి విన్నాం . కానీ కరోనా మహమ్మారీని ఎదుర్కొనేలా ప్రజలకు ఆర్థిక వెసులబాటును కల్పించేందుకే ఏర్పాటు చేసిన కరోనా రిలీఫ్‌ ఫండ్‌ని మోసం చేసి కటకటాల పాలయ్యాడు డుబ్లిన్‌కి చెందిన ఒక వ్యక్తి.

(చదవండి: ఒక గంట వ్యవధిలో ఐదువేల కిలోగ్రాములు బరువుని ఎత్తి రికార్డు సృష్టించాడు)

వివరాల్లోకెళ్లితే.....వినత్ ఔడోమ్‌సిన్ తన వ్యాపారంలో పనిచేస్తున్న వ్యక్తుల సంఖ్య, కంపెనీ స్థూల ఆదాయం తదితర వివరాలు చెప్పి తమ కంపెనీ ఉద్యోగుల కోసం అంటూ అబద్ధం చెప్పి కరోనా మహమ్మారి ఆర్థిక ఉపశమన రుణం కోసం దరఖాస్తు చేశాడు. దీంతో అతను 85 వేల డాలర్లు (సుమారు రూ. 63 లక్షలు) రుణం అందుకున్నాడు. ఆ తర్వాత అతను 57వేల డాలర్లు(రూ.43 లక్షలు) విలువ చేసే పోకీమాన్‌ కార్డులను కొని జల్సాలు చేశాడు.

పైగా  వేల డాలర్లకు అమ్ముడుపోయే ఈ పోకీమాన్‌ కార్డులను కొనుగోలు చేయడంతో అతన్ని డుబ్లిన్‌ డిఫెన్స్‌ పోలీసులు  అరెస్టు చేశారు. ఈ మేరకు ఇలా మోసం చేసి రుణం పొందినందుకు గానూ అతనికి 20 ఏళ్లు జైలు శిక్షతోపాటు 250 వేల డాలర్లు(సుమారు రూ.1.87 కోట్లు) జరిమాన విధించారు. నిజానికి శిక్ష తక్కువగానే ఉండేది కానీ కోవిడ్‌ మహమ్మారి కారణంగా ఆరోగ్యపరంగానూ, ఆర్థికంగానూ  దెబ్బతిన్న వారికి వెసులుబాటు కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన దాన్ని దుర్వినియోగం చేయడంతో యూఎస్‌ ప్రభుత్వం అతన్ని ఇంత కఠినంగా శిక్షించింది.

(చదవండి: జిమ్నాస్టిక్‌ విన్యాసాలతో ఆకట్టుకుంటున్న వికలాంగురాలు)

మరిన్ని వార్తలు