ఛేజింగ్‌ సమయంలో అనుహ్య ఘటన.... మంటల్లో చిక్కుక్కున్న వాహనదారుడు

28 Oct, 2022 16:02 IST|Sakshi

ట్రాఫ్రిక్‌ నియమాలను ఉల్లంఘించి కొంతమంది పోకిరీలు ర్యాష్‌ డ్రైవింగ్‌తో రోడ్లపై హల్‌చల్‌ చేస్తుంటారు. పోలీసులు వారిని ఛేజింగ్‌ చేసి పట్టుకునేందుకు యత్నించినా కూడా దొరకకుండా వెళ్లిపోతుంటారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి తప్పించుకునే క్రమంలో మంటల్లో చిక్కుకుని తీవ్ర గాయాలపాలయ్యాడు.

వివరాల్లోకెళ్తే...అమెరికాలో ఒక వాహనదారుడు నెంబర్‌ప్లేట్‌ లేకుండా రోడ్డుపై హల్‌చల్‌ చేయడంతో పోలీసులు అతన్ని పట్టుకునేందుకు యత్నించారు. ఐతే సదరు వాహనదారుడు పోలీసులకు దొరక్కుండా పారిపోయేందుకు యత్నించే క్రమంలో ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘించాడు. దీంతో పోలీసులు అతన్ని నియంత్రించే క్రమంలో టేజర్‌ అనే ఎలక్ట్రిక్‌ గన్‌సాయంతో కాల్పులు జరిపారు. ఐతే ఆ వ్యక్తి ఆ సయంలో తన వీపుకి గ్యాసోలిన్‌ ప్యాక్‌ని తగిలించుకున్నాడు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో బైక్‌ నుంచే దూకేశాడు.

దీంతో  పోలీసులు టేజర్‌తో నియంత్రించేందుకు యత్నించారు. అంతే ఒక్కసారిగా ఆ వాహనదారుడు చట్టు భగ్గుమని మంటలు వ్యాపించాయి. ఆ వాహనదారుడు పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయాడు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక యంత్రంతో ఆ మంటలను ఆర్పి తక్షణమే హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తులో సదరు వాహనదారుడిని 38 ఏళ్ల  క్రిస్టోఫర్ గేలర్‌గా గుర్తించారు. అతను ఇన్సూరెన్స్‌ చేయని బైక్‌పై  డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా నిర్లక్షపూరితంగా డ్రైవ్‌ చేస్తున్నట్లు తేలింది. అతను బ్యాక్‌ప్యాక్‌లో ఒక గ్యాలన్‌ గ్యాసోలిన్‌ని తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. మరికొద్దిరోజుల్లో సదరు వాహనదారుడు పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. 

(చదవండి:  ​డ్రోన్‌లతో కుక్కలను దింపి దాడులు.. దెబ్బకు శత్రువు ఆటకట్టు)

మరిన్ని వార్తలు