సిజేరియన్‌ డాక్టర్ల నిర్వాకం.. పసికందు ముఖంపై 13 కుట్లు

22 Jun, 2021 16:28 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో​ సిజేరియన్‌ డాక్టర్ల నిర్వాకం బయటపడింది. ఓ మహిళకు ప్రసవం చేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ల కారణంగా పసికందు ముఖంపై గాయమైంది. దాంతో శిశువు ముఖంపై ఏకంగా 13 కుట్లు పడ్డాయి. వివరాలలోకి వెళ్తే..  జూన్ 15 న కొలరాడోలోని డెన్వర్ హెల్త్ హాస్పిటల్‌లో డమార్కస్ విలియమ్స్ భార్య రిజానా డేవిస్ పడంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. కానీ డెలివరీ సమయంలో తమ బిడ్డ క్యాని విలియమ్స్‌కు కలిగిన గాయం చూశాక అల్లాడిపోయారు.

‘మొదట మేము నార్మల్‌ డెలివరీకే యత్నించాం. కానీ, ప్రసవ సమయంలో  వైద్యులు  పాప హృదయ స్పందన ఖచ్చితం కనుగొనలేకపోవడంతో వెంటనే రిజానాను  సి-సెక్షన్‌లోకి తీసుకువెళ్లారు. సిజేరియన్‌ తరువాత తల్లీ బిడ్డ క్షేమం అని చెప్పారు. అయితే, మా బిడ్డ ఎడమ చెంపపైన 13 కుట్లు ఉన్నాయి. ఇదేంటని డాక్టర్లను ప్రశ్నించగా సరైన సమాధానం లభించలేదు’ అని డమార్కస్ విలియమ్స్ చెప్పారు.

ఇక ఈ విషయం గురించి శిశువు తాతయ్య మాట్లాడుతూ.. ‘చిన్నారి క్యాని రాక మా అందరికీ ఆనందం కలిగించింది కాని అంతే భయం, బాధ కలిగింది’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదిని నియమించుకుని ఆస్పత్రిపై దావా వేస్తామని తెలిపారు.
చదవండి:విషాదం: ప్రపంచ రికార్డ్‌ కోసం ఫీట్‌ చేసి ప్రాణాలు కోల్పోయాడు 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు