కరోనా వ్యాక్సిన్‌: టీకా వేయించుకుంటే రూ.7 కోట్లు మీవే..

14 May, 2021 13:17 IST|Sakshi

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్‌ రూపొందించారు. కరోనా కట్టడికి ఏకైక పరిష్కారం వ్యాక్సినేషనే. ప్రపంచ దేశాలు పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్‌ వేయించేందుకు ముమ్మర చర్యలు తీసుకుంటున్నాయి. వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని కొన్ని దేశాలు, రాష్ట్రాలు బహుమతులు, ప్రోత్సహాకాలు, సహాయం వంటివి చేస్తున్నాయి. తాజాగా అమెరికాలోని ఒహియో రాష్ట్రం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. వ్యాక్సిన్‌ వేయించుకుంటే అక్షరాల 7 కోట్లకు పైగా డబ్బులు మీ సొంతమే.

అమెరికాలోని ఒహియో రాష్ట్ర గవర్నర్‌ మైక్‌ డివైన్‌ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వ్యాక్సిన్‌ వేయించుకుంటే లాటరీలో పాల్గొనవచ్చు. అందులో గెలిస్తే ఒక మిలియన్‌ డాలర్లు గెలుచుకోవచ్చు. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘మనం ఎన్నో సాధించాం. ఈరోజు మనం సురక్షితంగానే ఉన్నాం. భవిష్యత్‌లో మెరుగైన సమాజం కోసం.. కరోనాపై పోరాడేందుకు వ్యాక్సిన్‌ వేయించుకోండి’ గవర్నర్‌ పిలుపునిచ్చారు. 

  • మే 26వ తేదీన తేదీన లాటరీ ఓపెన్‌ చేసి విజేతను ప్రకటిస్తామని గవర్నర్‌ మైక్‌ డివైన్‌ తెలిపారు.. 18 ఏళ్లు పైబడిన వారికి లాటరీలో ఒక మిలియన్‌ డాలర్ల నగదు అందిస్తామని  వెల్లడించారు. మే 18వ తేదీ నుంచి పెద్ద వారికి రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయని వివరించారు.
  • ఇక 17ఏళ్లలోపు వారందరూ వ్యాక్సిన్‌ వేసుకుంటే గెలిచిన వారికి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో నాలుగేళ్ల ఉపకార వేతనం అందిస్తామని ప్రకటించారు. దీంతో ఆ రాష్ట్రంలో వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారు.

చదవండి: ‘కోవిషీల్డ్’ డోసుల వ్యవధిలో కీలక మార్పులు
చదవండి: కంగారొద్దు.. రెమిడిసివిర్‌ కొరత లేదు

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు