మాకు పిల్లలు కావాలి.. వ్యాక్సిన్‌ వద్దంటున్న అమెరికన్లు

15 May, 2021 16:37 IST|Sakshi

వాషింగ్ట‌న్: బైడెన్‌ ప్రభుత్వం తమ దేశప్రజలకు వ్యాక్సినేష‌న్ ప్రక్రియ పూర్తి చేసి కోవిడ్‌ నుంచి ఉపశమనం పొందాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ ఇటీవల టీకాకు సంబంధించిన ఓ వార్త కారణంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మంద‌గించేలా కన్పిస్తోంది. ఎందుకంటే అక్కడి 18 నుంచి 49 ఏళ్ల మ‌ధ్య ఉన్న అమెరికన్లలో ఇంకా స‌గం మంది టీకా తీసుకోలేదు. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో ఈ అంశంపై పలు రకాలుగా వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి.

టీకా ప్రభావం కారణంగా రానున్న రోజుల్లో సంతాన‌ప్రాప్తిని కోల్పోయే అవకాశం ఉందంటూ సోష‌ల్ మీడియాలో పుకార్లు హల్‌ చల్‌ చేస్తున్నాయి. దీంతో అమెరికన్లు టీకా వేయించుకునేందుకు వెనుకాడుతున్నారు. ఇలాంటి ఫేక్ పోస్టుల‌తో ప్రస్తుతం అమెరికా ప్రజలు స‌త‌మ‌తమవుతున్నారు.  దీంతో బిడైన్‌ ప్రభుత్వ లక్ష్యానికి  ఇదో సమస్యగా మారింది. 
మాకు టీకా వద్దు బాబోయ్‌
టీకా వ‌ల్ల ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ దెబ్బ‌తింటుంది కాబ‌ట్టి.. మ‌హిళ‌లు టీకాలు తీసుకోవ‌డం లేద‌ని ఓ అమెరికా అధ్య‌య‌నం తేల్చింది. ఫెర్టిలిటీ వ్య‌వ‌స్థ‌పై వ్యాక్సిన్ నెగ‌టివ్ ప్ర‌భావం చూపిస్తుంద‌ని ప్రజలు భావిస్తున్నారు. అందుకే వ్యాక్సిన్ తీసుకోని వారు ఇదే ఉద్దేశాన్ని వ్య‌క్తం చేస్తున్న‌ట్లు కైస‌ర్ ఫామిలీ ఫౌండేష‌న్ డైర‌క్ట‌ర్ అష్లే కిర్‌జింగ‌ర్ తెలిపారు. ఈ నెల ప్రారంభంలో జరిపిన పరిశోధనలో మూడింట రెండు వంతుల మంది టీకాను వేసుకోలేమని కారణంగా, వారి సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుందేమో అని ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో 18 నుంచి 49 సంవత్సరాల వయసు గల స్త్రీలలో 50 శాతం, పురుషులలో 47 శాతం మంది ఇలాంటి భయాలు మొదలయ్యాయి. కారణంగా ఇంతవరకు వారెవరూ టీకాలు వేయించుకోవడానికి ముందుకు రావడంలేదు. ఈ క్రమంలో కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ నుంచి మొదట్లో గర్భిణీ స్త్రీలను మినహాయించడం కూడా ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయనే చెప్పాలి. కొందరి వాదనేమో ఇలా ఉంది.. వ్యాక్సిన్లు ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ‌ను టార్గెట్ చేస్తాయంటే.. అది కొంత ఆడ‌వారికి ఆందోళ‌న క‌లిగించే అంశ‌మే అని అంటున్నారు. అయితే వ్యాక్సిన్లు తీసుకుంటే వంధ్య‌త్వం వ‌స్తుంద‌న్న ఆధారాలు ఏమీ లేవ‌ని  శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

( చదవండి: వ్యాక్సినేషన్‌ పూర్తయితే మాస్కు అక్కర్లేదు )

మరిన్ని వార్తలు