అందరూ!....వెక్కిరించి అవమానించే ఏకైక వైకల్యం...నత్తి!!

1 Dec, 2021 20:40 IST|Sakshi

మనకు ఉండే చిన్నలోపాల్ని మనమే పెద్దపెద్ద సమస్యగా చూసి నిరాశనిస్ప్రహలకి లోనైపోతాం. అంతేకాదు సరైన విధంగా ఆలోచించం. పైగా ఎవర్ని సలహలు, సూచనలు కూడా అడగకుండా అట్లా ఉసూరుమంటూ ఉండిపోతాం. కానీ ఇక్కడొక అమ్మాయి తన లోపాన్ని సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడితో ముచ్చటించి సరి చేసుకుంటుంది చూడండి.!

(చదవండి: హే!..రెండు వారాల్లో పిల్లలకు కూడా కోవిడ్‌ వ్యాక్సిన్‌!!)

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌  థాంక్స్ గివింగ్ సెలవుదినం సందర్భంగా నాన్‌టుకెట్‌కు వెళ్లిన సమయంలో డెన్మార్క్ మాజీ రాయబారి రూఫస్ గిఫోర్డ్ మేనకోడలు అవేరితో మాట్లాడిన సంభాషణ చూడముచ్చటగా ఉంటుంది. ఈ మేరకు అవేరికి కాస్త నత్తి ఉంటుంది. దీంతో ఆమె బైడెన్‌తో కాస్త తడబడుతూ మాట్లాడుతూ ఉంటుంది. దీంతో బైడెన్‌ అవేరిని ప్రోత్సహిస్తూ ...నత్తిగా వస్తున్న పర్వాలేదు అలాగే మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉండు అని అంటాడు. ఆ తర్వాత ఆమె తన ప్రసంగాన్ని ముగించి బైడెన్‌ని ఆనందంగా కౌగలించుకుంటుంది.

ఈ మేరకు ఈ సంభాషణకు సంబధించిన వీడియోని రూఫస్ గిఫోర్డ్ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ...ఈ రోజు నా మేనకోడలు ఇప్పటి వరకు నత్తితో పోరాడితోంది. ఈ రోజు తనకు తెలిసిన వ్యక్తితో సంభాషించి నత్తిని ఎలా జయించాలో తెలుసుకుంది అంటూ ట్వీట్‌ చేశారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు గతంలో సీఎన్‌ఎన్‌ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.." నేను కూడా చిన్నతనంలో నత్తిగా మాట్లాడేవాడిని . అంతేకాదు ప్రజలందరూ వెక్కిరించి అవమానించే ఏకేక వైకల్యం. ఆ లోపాన్ని పోగొట్టుకునేందకు చాలా కష్టపడ్డాను. పైగా అద్దం ముందు నిలబడి గంటల తరబడి ప్రసంగిస్తూ ఆ లోపాన్ని జయించాను" అని చెప్పారు.

(చదవండి: ఎంత అమానుషం!.... గాయపడిన మూగజీవిపై పైశాచికం!!)

మరిన్ని వార్తలు