చేతికి బ్యాండ్లు, ముఖానికి మాస్కులు

23 Jan, 2021 04:04 IST|Sakshi

కరోనాపై యుద్ధం ప్రకటించిన బైడెన్‌ 

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఎన్నికల హామీ మేరకు కరోనాపై యుద్ధం ప్రకటించారు. డొనాల్డ్‌ ట్రంప్‌ మాదిరిగా కాకుండా ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తూ వైట్‌హౌస్‌లో కరోనా నిబంధనల అమలు ప్రారంభించారు. చేతికి రిస్ట్‌ బ్యాండ్‌లు (ఈ బ్యాండ్‌లో ట్రాకర్‌ సాయంతో కోవిడ్‌ రోగుల్ని గుర్తించవచ్చు) ముఖానికి మాస్కులు తప్పనిసరి చేశారు. భౌతిక దూరం నిబంధనలు అమలయ్యేలా ఉద్యోగుల సీట్లను ఆరడగుల దూరంలో ఏర్పాటు చేశారు.   కరోనాపై పోరాటమే తన ప్రథమ ప్రాధాన్యంగా బైడెన్‌ గురువారం పలు ఉత్తర్వులు జారీ చేశారు. ‘‘కరోనాతో మరణించే వారి సంఖ్య 4 లక్షలు దాటిపోయింది, రెండో ప్రపంచ యుద్ధ మృతులు కంటే ఇది ఎక్కువ. వచ్చే నెల మృతులు 5 లక్షలు దాటిపోతాయి. అందుకే ఈ వైరస్‌పై యుద్ధ ప్రాతిపదికన పోరాటం చేయాలి’’ అని బైడెన్‌ చెప్పారు.   అమెరికా అంటువ్యాధుల నిఫుణుడు డాక్టర్‌ ఫాసీ, ఇతర వైద్య రంగ ప్రముఖుల సహకారంతో కరోనా కట్టడికి వ్యూహాన్ని రచించారు.  

కరోనా కట్టడికి వ్యూహం
► బహిరంగ ప్రదేశాల్లో 100 రోజుల పాటు అందరూ మాస్కులు ధరించాలి.  
► ప్రభుత్వ కార్యాలయాలు, షాపింగ్‌ మాల్స్‌లోకి వచ్చినప్పుడు  భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలి.  
► శ్వేత సౌధానికి వచ్చే వారంతా చేతికి కరోనా ట్రాకర్‌ బ్యాండ్‌  ధరించాలి.  
► అమెరికాకు వచ్చే ప్రతీ ఒక్కరూ కరోనా పరీక్ష చేయించుకున్నా కే విమానం ఎక్కాలి  
► అమెరికాలో దిగాక విధిగా హోంక్వారంటైన్‌లో ఉండాలి. 

మరిన్ని వార్తలు