మోదీకి షాకిచ్చిన అమెరికా.. బీబీసీ డాక్యుమెంటరీపై యూటర్న్!

26 Jan, 2023 11:22 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రధాని నరేంద్ర మోదీ 2002లో గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన అల్లర్లపై బీబీసీ రెండు వీడియోల డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే. ఇది దురుద్దేశపూర్వకంగా ఉందని కేంద్రం ఈ వీడియోలను బ్యాన్ చేసింది. గతవారమే ట్విట్టర్‌, యూట్యూబ్‌లో ఈ వీడియో లింక్స్‌ను బ్లాక్ చేసింది.

అయితే అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ తాజాగా దీనిపై స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతికా స్వేచ్ఛకు తాము మద్దతు ఇస్తామని, ప్రాజాస్వామ్య విలువలను భావప్రకటనా స్వేచ్ఛ, మతం మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. భారత్‌కు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు.

సోమవారం ఇదే విషయంపై మాట్లాడిన ప్రైస్.. మోదీపై బీబీసీ రూపొందించన డాక్యుమెంటరీ గురించి తనకు తెలియదని, భారత్-అమెరికా బంధం ప్రత్యేకమన్నారు. రెండు దేశాల ప్రజాస్వామ్య విలువలు ఒకేలా ఉంటాయని వ్యాఖ్యానించారు.  భారత్‌లో జరిగిన విషయాల గురించి గతంలోనే తాము మాట్లాడినట్లు పేర్కొన్నారు. కానీ ఒక్కరోజులోనే యూ టర్న్ తీసుకుని బీబీసీ డాక్యుమెంటరీని భారత్‌లో నిషేధించడాన్ని పరోక్షంగా తప్పుబట్టారు.

2002లో మోదీ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్‌లో మతపరమైన ఘర్షణలు చెలరేగాయి. కరసేవకులు ప్రయాణించిన రైలుకు దుండగుడు నిప్పుపెట్టిన ఘటనలో 50మందికిపైగా చనిపోయిన తర్వాత ఈ హింస మొదలైంది. ఈ ఘర్షణల్లో 1000 మందికిపైగా చనిపోయారు. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం మోదీకి 2012లోనే క్లీన్‌చిట్ ఇచ్చింది. కానీ బీబీసీ గుజరాత్ అల్లర్లపై ఇన్వెస్టిగేషన్ చేసి రెండు వీడియోల రూపంలో డాక్యుమెంటరీ రూపొందించి ఇటీవలే విడుదల చేసింది. ఇందులో విషయమేమీ లేదని, పూర్తింగా దురుద్దేశపూర్వకంగా ఉందని కేంద్రం ఈ వీడియోలను బ్యాన్ చేసింది.
చదవండి: దారుణమైన పరిస్థితులు.. ప్రభుత్వ ఉద్యోగులకు షాక్‌! జీతాల్లో 10 శాతం కోత

మరిన్ని వార్తలు