Viral Video: మంచి చెప్పడమే ఆమెకు శాపమైంది!.. యువతిపై పిడుగుద్దులు.. కన్ను కోల్పోవడంతో

18 Nov, 2022 15:16 IST|Sakshi

కొంతమంది చాలా ర్యాష్‌గా ప్రవర్తిస్తుంటారు. చేసిందితప్పు అని చెప్తే ఇంకా కోపం కట్టలు తెచ్చుకుంటుంది. నచ్చచెప్పే ప్రయత్నం, శాంతంగా వివరణ ఇచ్చిన బుర్రకెక్కుదు. పైగా అలా చెప్పిన వాళ్లని తిట్టడమో! లేక వారిపై దాడి చేయడమో చేస్తారు. అచ్చం అలాంటి ఘటనే యూఎస్‌లోని ఒక రెస్టారెంట్‌లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకెళ్తే....అమెరికాలోని బియాంకా ప్లోమెరా అనే 19 ఏళ్ల యువతి హ్యాబిట్‌ బర్గర్‌ గ్రిల్‌ రెస్టారెంట్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తోంది. అయితే అక్కగే ఒక దివ్యాంగుడు కూడా పనిచేస్తున్నాడు. కొంతమంది మగవాళ్లు సదరు దివ్యాంగుడిని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించడం ప్రారంభించారు. దీన్ని చూసిన అసిస్టెంట్‌ మేనేజర్‌ ప్లోమెరా వారిని అడ్డుకుని మీరు చేసింది కరెక్ట్‌ కాదు, అతను దివ్యాంగుడు అని నచ్చచెప్పే ప్రయత్నం చేసింది.

అంతే ఒక వ్యక్తి అనూహ్యంగా ఆమె ముఖంపై పిడిగుద్దులతో దాడి చేశాడు. దీంతో ఆమె ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. ఆ తర్వాత వెంటనే ఆమె కూడా ప్రతిదాడి చేయడం ప్రారంభించగా... మళ్లీ యువతి ఘోరంగా దాడి చేసి వెళ్లిపోయాడు.  ఈ ఘటనలో యువతి కుడి కన్నుకి తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను సహోద్యోగులు ఆస్పత్రికి తరలించినప్పటికీ వైద్యులు మాత్రం ఆమె కన్నుని కాపాడలేకపోయారు.

ఫలితంగా ఆమె కుడి కన్నుని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అందుకు సంబంధించిన ఘటన మొత్తం సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సదరు రెస్టారెంట్‌ వద్దకు వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

(చదవండి: ప్రియురాలికి న్యాయం చేయాలంటూ భవనంపై నుంచి దూకేశాడు)

>
మరిన్ని వార్తలు