రష్యాపై అమెరికా ఆంక్షలు

3 Mar, 2021 03:37 IST|Sakshi
అలెక్సీ నావల్నీ

వాషింగ్టన్‌: రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ (44)పై విషప్రయోగం చేయడం, అరెస్టు చేయడం వంటి చర్యలను నిరసిస్తూ బైడెన్‌ ప్రభుత్వం రష్యాపై అంక్షలను విధించింది. 14 బిజినెస్, ఇతర ఎంటర్‌ప్రైజెస్‌పై ఆంక్షలను విధించినట్లు అమెరికా అధికారులు మంగళవారం వెల్లడించారు. ఇవన్నీ బయలాజికల్, కెమికల్‌ ఏజెంట్ల తయారీ కంపెనీలు కావడం గమనార్హం. అయితే అందులో రష్యా అధికారుల పేర్లు లేవని తెలిపారు.

రష్యాపై అమెరికా పెట్టబోతున్న పలు ఆంక్షల్లో ఇవి ప్రారంభ ఆంక్షలు మాత్రమే అని అధికారులు వ్యాఖ్యానించారు. ‘రష్యా ప్రతిపక్ష నాయకుడిపై దాడులు చేయడం, విదేశీ వ్యవహారాలను హ్యాక్‌ చేయడం, అమెరికా ప్రభుత్వ ఏజెన్సీలను హ్యాక్‌ చేయడం వంటి వాటిపై బైడెన్‌ ప్రభుత్వం తీసుకున్న మొదటి చర్యలివి..’ అంటూ అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ ఆంక్షల వివరాలను యూరోపియన్‌ యూనియన్‌కు కూడా పంపినట్లు తెలిపారు.   

చదవండి: (హెచ్‌–1బీపై ఎటూ తేల్చని బైడెన్‌ ప్రభుత్వం)

మరిన్ని వార్తలు