'మా ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామి భారత్‌": యూఎస్‌ పొగడ్తల జల్లు

28 Feb, 2023 11:48 IST|Sakshi

భారత్‌ తమ ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామిగా అమెరికా పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ కార్యదర్శి టోనీ బ్లింకెన్‌ జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంతో సహా అనేక కీలక సమావేశాలకు హాజరు అయ్యేందుకు న్యూడిల్లీకి బయలుదేరినట్లు బైడెన్‌ ప్రభుత్వం తెలిపింది. అక్కడ బ్లింకెన్‌ క్వాడ్‌ మంత్రివర్గ సమావేశానికి కూడా హాజరవుతారని, విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని పేర్కొంది.

ఈ క్రమంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భారత్‌ మా ప్రపంచ వ్యహాత్మక భాగస్వామి. భారత్‌తో మాకు విస్తృత, విశాలమైన లోతైన సంబంధాలు ఉన్నాయి. మేము భారత్‌తో స్వేచ్ఛ, బహిరంగ ఇండో పసిఫిక్‌ ప్రాంతం దార్శనికతను పంచుకుంటాం. ఎందుకంటే మా భాగస్వామ్య దేశాలలో భారతదేశమే మాకు కీలక భాగస్వామి. ఇటీవల 12యూ2 గురించి మాట్లాడాం. ఇందులో భారత్‌ తన కొత్త భాగస్వామ్యం యూఏఈని కలిగి ఉంది. దీనికి సంబంధించి అజెండాలో అనేక కీలక అంశాలు ఉన్నాయి, వాటిని మా విదేశాంగ మంత్రి తన ప్రసంగంలో వెల్లడిస్తారు.

అలాగే కజికిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌ పర్యటనల అనంతరం బ్లింకెన్‌ మూడురోజుల భారత్‌ పర్యటన కోసం న్యూఢిల్లీ చేరుకోనున్నారు. అక్కడ ద్వైపాక్షిక సమావేశాల సందర్భంగా రష్యా, చైనా రెండు చర్చల్లో పాల్గొంటాయని భావిస్తున్నాం. అలాగే ఇది యుద్ధ యుగం కాదంటూ భారత ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను కూడా విన్నాం. రష్యా నిబంధనల ఆధారిత క్రమం అంతర్జాతీయ చట్ట సూత్రాలను సార్వత్రిక మానవ హక్కులను సవాలు చేస్తున్నాయి. వీటిని గురించి భారత్‌తో చర్చిస్తూనే ఉంటాం. వారు జీ20 కోసం దాని చుట్టూ ఉన్న ఎజెండాలోను ఉంటారనే నమ్ముతున్నాం. అలాగే ఈ సమావేశంలో భారత్‌తో యూఎస్‌ అత్యంత ముఖ్యమైన విషయాలను షేర్‌ చేసుకోవడం, చర్చించడం వంటివి చేస్తాం" అని పేర్కొన్నారు. 

(చదవండి: 18 ఏళ్ల వరకు చదవడం, రాయడం రాదు! కానీ ప్రొఫెసర్‌ అయ్యాడు!)

మరిన్ని వార్తలు