Seema Nanda నియామకానికి సెనేట్‌ ఆమోదం

17 Jul, 2021 09:21 IST|Sakshi

అమెరికా కార్మిక శాఖ సొలిసిటర్‌గా భారత సంతతి మహిళ

వాషింగ్టన్‌ : అమెరికాలోని జో బైడెన్‌ ప్రభుత్వంలో మరో భారతీయ సంతతి మహిళకి చోటు లభించింది. కార్మిక శాఖ సొలిసిటర్‌గా భారత సంతతికి చెందిన పౌరహక్కుల న్యాయవాది సీమా నందా నియామకానికి అమెరికన్‌ సెనేట్‌ ఆమోద ముద్ర వేసింది. 48 ఏళ్ల వయసున్న సీమా నందా డెమొక్రాటిక్‌ నేషనల్‌ కమిటీకి సీఈఓగా కూడా పని చేశారు. ఒబామా హయాంలో కార్మిక శాఖకి సేవలు అందించారు.

కాగా నందా నియామకాన్ని సెనేట్‌ 53–46 ఓట్లతో ఆమోదించింది. సీమా నందా నియామకంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కరోనా ముప్పు, వాతావరణంలో మార్పులతో యాజమాన్యాలు, కార్మికులు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొం టున్న తరుణంలో కార్మిక శాఖ సొలిసిటర్‌గా ఆమె నియామకం అత్యంత కీలకంగా మారింది.  

మరిన్ని వార్తలు