చైనాని శత్రువుగా చిత్రీకరించవద్దు! అమెరికా చారిత్రక తప్పిదం

12 Jun, 2022 17:08 IST|Sakshi

Taking Us As Threat  historic and strategic mistake: సింగపూర్‌లో యూఎస్‌ రక్షణాధికారి లాయిడ్‌ ఆస్టిన్‌తో చైనా రక్షణమంత్రి వీ ఫెంఘే ముఖాముఖి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఐతే ఆ సమావేశంలో యూఎస్‌ రక్షణాధికారి ఆస్టిన్‌ తైవాన్‌ని ఇబ్బంది పట్టేలా సైనిక చర్యలకు పాల్పడవద్దంటూ హెచ్చరించారు కూడా. దీంతో చైనా రకణ మంత్రి వీ ఫెంఘే తైవాన్‌ని అడ్డుపెట్టుకుని చైనాని బెదిరించాలనుకోవడం అమెరికా చారిత్రక వ్యూహాత్మిక తప్పిదం అవుతుందన్నారు. చైనాని ముప్పుగానూ లేదా శత్రువుగానూ పరిణించడం తగదని యూఎస్‌కి హితవు పలికారు.

ఇది ఇరుదేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తుందని చెప్పారు. ప్రపంచ శాంతికి ఇరు దేశాల అభివృద్ధి కీలకమని గట్టిగా నొక్కి చెప్పారు. ఇకనైనా చైనా ప్రయోజనాలను దెబ్బతీయాలని చూడటం మానుకోవాలని అమెరికాకు సూచించారు. చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పారు. వాస్తవానికి 1949 అంతర్యుద్ధంలో తైవాన్‌, చైనా విడిపోయాయి.

కానీ చైనా స్వయంపాలిత దేశమైన తైవాన్‌ని తిరుగబాటు ప్రావిన్స్‌గా పేర్కొంది. చైనాని బెదిరించడానికి తైవాన్‌ను వాడుకుంటే మాత్రం సహించబోమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. అలాగే దక్షిణ చైనా సముద్ర తీరం వెంబడి ఉన్న ఫిలిప్పీన్స్, బ్రూనై, మలేషియా  వియత్నాంతో సహా అన్ని వివాదాస్పదమైన భూభాగాలు తనవే అని చైనా వాదిస్తోంది కూడా. పైగా తూర్పు చైనా సముద్ర ప్రాంతంలో జపాన్‌తో కూడా చైనాకు ప్రాదేశిక వివాదాలు ఉన్నాయి.

(చదవండి: తైవాన్‌ విషయంలో తగ్గేదే లే అంటున్న చైనా!... అమెరికాకు గట్టి వార్నింగ్)

మరిన్ని వార్తలు