ఉత్తర కొరియాకు దిమ్మతిరిగే కౌంటర్‌! అమెరికా దక్షిణ కొరియా వైమానిక కసరత్తులు

7 Nov, 2022 14:25 IST|Sakshi

ఉత్తరకొరియా గతవారమే ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా దక్షిణ కొరియాలు తమ ఉమ్మడి వైమానిక దళ విన్యాసాలతో ఉత్తర కొరియాకి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చాయి. ఈ విషయమై ఉత్తర కొరియా చాలా గట్టిగా ప్రతి స్పందించింది. దీన్ని ఉత్తర కొరియా ఉద్దేశపూర్వకంగా బహిరంగంగా రెచ్చగొట్టే చర్యగా అభివర్ణించి. అంతేగాదు తమను లక్ష్యంగా చేసుకుని ఇలా దూకుడుగా విన్యాసాలు చేపట్టిందని మండిపడింది.

యుద్ధ సన్నాహాల్లో భాగంగానే ఇలా చేస్తుందంటూ సీరియస్‌ అయ్యింది. ఈ విన్యాసాల వల్ల ప్రంపచానికి ఎలాంటి ముప్పు ఉండదంటూ ఉత్తర కొరియా వ్యాఖ్యలను కొట్టిపారేసింది అమెరికా. వైమానిక దళ స్థావరాలపై దాడుల జరిపే బాలిస్టిక్‌ క్షిపణులతో సహా శత్రు విమానాలను ధ్వంసం చేసే విన్యాసాలను కూడా ప్రాక్టీస్‌ చేసినట్లు ఉత్తర కొరియా పేర్కొంది. ఈ విషయమై సుమారు 500 విమానాలతో ఉత్తర కొరియా ఒక భారీ కంబాట్‌ ఆపరేషన్‌ నిర్వహించినట్లు తెలిపింది. అంతేగాదు సైనిక కార్యకలాపాలకు సంబంధించిన చిత్రాలను సైతం విడుదల చేసింది.

విజిలెంట్‌ స్టార్మ్‌ వంటి వైమానికి విన్యాసాలను ఉత్తర కొరియా చాలా సీరియస్‌గా తీసుకుంది. ఎందుకంటే వైమానిక దళం పరంగా ఉత్తర కొరియా చాలా బలహీనంగా ఉంటుంది. వాస్తవానికి ఉత్తర కొరియా వద్ద ఉన్న యుద్ధ విమానాల కంటే యూఎస్‌ దక్షిణ కొరియాల వద్ద ఉన్న విజిలెంట్‌ స్టార్మ్‌ ఎఫ్‌ 35 స్టెల్త్‌ ఫైటర్‌లతో సహా అత్యంత ఆధునిక యుద్ధ విమానాలు ఉన్నాయి. అందువల్లే ఈ వైమానికి విన్యాసాల విషయంలో ఉత్తరకొరియా అగ్గిమీద గుగ్గిలమవుతోంది.

అదీగాక ఉత్తర కొరియ గతవారం వరుస క్షిపణి ప్రయోగాల దృష్ట్యా యూఎస్‌ దక్షిణ కొరియాలు ఈ విన్యాసాలను ఒకరోజు పొడిగించారు. దీంతో ఉత్తర కొరియా దీన్ని వార్‌ రిహార్సిల్స్‌ అంటూ గగ్గోలు పెడుతోంది. అదీగాక దక్షిణ కొరియా కంప్యూటర్‌ ఆధారిత మిలటరీ విన్యాసాన్ని కూడా సోమవారమే ప్రారంభించింది. ఉత్తర కొరియా బెదిరింపులకు తలొగ్గకుండా ఉండేలా తన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది దక్షిణ కొరియా. 

(చదవండి: ఇమ్రాన్‌ ఖాన్‌ నటనలో షారుక్‌, సల్మాన్‌లను మించిపోయారు)

>
మరిన్ని వార్తలు