విస్కీ బాటిల్‌ ఎక్కడుంది? విచారణ చేపట్టిన అమెరికా

6 Aug, 2021 11:52 IST|Sakshi

వాషింగ్టన్‌: విస్కీ బాటిల్‌ కనిపించడం లేదని అమెరికా విచారణ చేపట్టింది. ఈ విస్కీ ఖరీదు 5800  డాలర్లు (రూ.4.30 లక్షలు) కాగా, దాన్ని 2019 లో అప్పటి విదేశాంగ కార్యదర్శి మైక్‌ పాంపియోకు జపాన్‌ ప్రభుత్వం బహుకరించిందని ట్రెజరీ విభాగం తెలిపింది. ప్రస్తుతం ఆ బాటిల్‌ అధికారిక లెక్కల్లో కనిపించడం లేదని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

దీంతో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని సంబంధిత అధికారులు మాయమైన ఆ విస్కీ బాటిల్‌ ఆచూకీ కోసం విచారణ చేపట్టారు. విదేశాంగ కార్యదర్శిగా పాంపియో పని చేస్తున్నప్పుడు జూన్ 24, 2019 న సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో జపాన్ అధికారులు అమెరికా విదేశాంగ శాఖకు బహుమతి ఇవ్వగా అది పాంపియో స్వీకరించాడా లేదా అనేది అస్పష్టంగా ఉందని టైమ్స్ నివేదిక పేర్కొంది. అయితే ఈ అంశంపై పాంపియో న్యాయవాది స్పందిస్తూ.. మిస్టర్ పాంపియోకి అప్పట్లో ఈ విస్కీ బాటిల్ అందుకున్న జ్ఞాపకం లేదు, అలానే ఆ బాటిల్‌ ఎలా మాయమైందనేది కూడా తనకు తెలియదని వెల్లడించారు. ప్రభుత్వ అధీనంలో ఉండే ఒక వస్తువు మాయంకావడంతో ఈ వార్త అక్కడ వైరల్‌గా మారింది. 

మరిన్ని వార్తలు