వాల్‌మార్ట్‌ స్టోర్‌లో కాల్పుల కలకలం.. 10 మంది మృతి

23 Nov, 2022 11:42 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో తుపాకీ మరోసారి గర్జించింది. వర్జీనియాలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో ఓ సాయుధుడు విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో దాదాపు 10 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

తుపాకీతో స్టోర్‌లోకి వెళ్లిన వ్యక్తి కన్పించినవారిపై కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు.  అతను వాల్‌మార్ట్‌లో పనిచేసే ఉద్యోగా? కాదా? తెలియాల్సి ఉందన్నారు. నిందితుడు కూడా స్టోర్ లోపలే చనిపోయి ఉన్నాడని పేర్కొన్నారు. అయితే పోలీసులే నిందితుడ్ని కాల్పి చంపి ఉంటారని స్థానిక మీడియా చెప్పింది. కానీ తాము కాల్పులు జరపలేదని పోలీసు అధికారులు తెలిపారు. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడే తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు.
చదవండి: ఘోర అగ్ని ప్రమాదం.. 38 మంది సజీవదహనం

మరిన్ని వార్తలు