ఎయిర్‌పోర్టులో పోయిన బ్యాగ్.. నాలుగేళ్ల తర్వాత ప్యాసెంజర్ దగ్గరకు.

14 Jan, 2023 17:21 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో ఓ మహిళ ఎయిర్‌పోర్టులో నాలుగేళ్ల క్రితం పోగోట్టుకున్న బ్యాగ్ మళ్లీ దొరికింది. సదరు విమానయాన సంస్థ ఆమెకు ఫోన్ చేసి బ్యాగ్‌ను అప్పగించింది. అయితే బ్యాగ్ కొంత ధ్వంసమైంది. కానీ అందులోని వస్తువులు, దుస్తులు చెక్కుచెదరలేదు.

2018లో చికాగో నుంచి సెంట్రల్ ‍అమెరికా వెళ్లింది గావిన్. అయితే ఆమె బ్యాగ్ మాత్రం ఎయిర్ పోర్టులోనే పోయింది. విమానయాన సంస్థకు ఈ విషయంపై ఫిర్యాదు చేసింది. వాళ్లు అప్పుడు బ్యాగు కోసం వెతికినా దొరకలేదు. పరిహారంగా కొంత డబ్బు ఇచ్చారు.

అయితే నాలుగేళ్ల తర్వాత ఆ బ్యాగ్‌ను హాండురాస్ విమానాశ్రయంలో గుర్తించారు. వెంటనే ఆ మహిళకు ఫోన్ చేసి బ్యాగును హ్యూస్టన్‌కు పంపించారు. దీంతో ఆమె వెళ్లి దాన్ని తీసుకుంది.

చికాగో విమానాశ్రయంలో బ్యాగును సరిగ్గా స్కాన్ చేయకపోవడం వల్లే పొరపాటు జరిగిందని, అది ఎక్కడుందో ఇన్ని రోజులు గుర్తించలేకపోయామని విమానయాన సంస్థ వివరణ ఇచ్చింది.
చదవండి: ఆ పాస్‌పోర్టుకు పవరెక్కువ

మరిన్ని వార్తలు