కిడ్నాప్‌ అనుమానంతో డ్రైవర్‌పై కాల్పులు

26 Jun, 2023 05:43 IST|Sakshi

టెక్సాస్‌: ఉబర్‌ డ్రైవర్‌ తనను కిడ్నాప్‌ చేస్తున్నాడన్న అనుమానంతో అమెరికాకు చెందిన ఒక మహిళ దారుణానికి దిగింది. మెక్సికోకు తనను తీసుకువెళుతున్నాడని భయపడి డ్రైవర్‌పై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ ఆస్పత్రిలో మృతిచెందాడు. టెక్సాస్‌కు చెంది ఫోబె కోపాస్‌ (48) తన ప్రియుడి దగ్గరికెళ్లేందుకు ఉబర్‌ క్యాబ్‌ బుక్‌ చేసుకుంది. కారు ఎక్కాక ఫోన్‌లో ఏదో మాటల్లో పడిపోయిన ఆమె ఆ తర్వాత హఠాత్తుగా పరిసరాలను చూసి తనను మెక్సికోకి తీసుకువెళుతున్నారని అనుమానపడింది.

వెంటనే తన బ్యాగ్‌లో ఉన్న తుపాకీతో డ్రైవర్‌ డేనియల్‌ పియేడ్రాపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో మెడకు తీవ్ర గాయాలైన అతను రక్తపు మడుగులో పడిపోయాడు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా పోలీసులకు సమాచారం ఇచి్చంది. పోలీసుల విచారణలో ఆ డ్రైవర్‌ కిడ్నాప్‌ చేయడానికి ప్రయతి్నంచినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అందుకే ఆమెపై హత్య కేసు నమోదు చేశారు. ఉబర్‌ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఇలాంటి హింసను సహించలేమంటూ ఫోబె మళ్లీ ఉబర్‌ సేవలు వినియోగించుకోకుండా నిషేధం విధించింది. 

మరిన్ని వార్తలు