యువతి స్పెషల్‌ టాలెంట్‌.. సెల్‌ఫోన్‌పై తుపుక్‌.. తుపుక్‌ అని ఉమ్మేసి.. !

4 May, 2022 20:45 IST|Sakshi

సోషల్ మీడియా వాడుతున్న యూజర్లు సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ క్రమంలో ఫోటోలు, వీడియోలు ఇలా ఒకటేంటి ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా నెట్టింట దర్శనమిస్తుంటాయి. అందులో కొన్ని వీడియోలు వైరల్‌గా మారి అందులోని వాళ్లు రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన ఘటనలు ఉన్నాయి. అందుకే ప్రపంచ నలుమూలల జరిగిన ‍వీడియోలు క్షణాల్లో సోషల్‌మీడియాలో కనిపిస్తుంటాయి. తాజాగా ఓ యువతి వీడియో నెట్టింట హల్ చల్‌ చేస్తోంది.

వివరాల్లోకి వెళితే.. యూఎస్కు చెందిన ఓ యువతికి స్పెషల్ ట్యాలెంట్ ఉంది. సాధారణంగా ఎవరైనా తమ ఫోన్‌లను చేతివేళ్లతో అన్‌లాక్ చేస్తారు. అయితే రోటీన్‌కి భిన్నంగా ఆ యువతి తన లాలాజలంతో మొబైల్‌ని అన్ లాక్ చేస్తుంది. మొబైల్‌ వినియోగదారులు తమ ఫోన్‌ అన్‌లాక్‌ని చేతివేళ్లు, ప్యాటర్న్, ఇమేజ్ పద్ధతులను ఉపయోగించి ఓపన్‌ చేస్తుంటారు. ఆమె మాత్రం అలా చేయకుండా తన ఉమ్మితో ఫోన్ను అన్ లాక్ చేస్తోంది. ఇటీవల తాను స్నేహితులతో కలిసి పబ్కు వెళ్లింది.

అక్కడ తన ఫోన్‌ని ఉమ్మితో అన్ లాక్ చేస్తానని పందెం కాసింది. ఇంకేముంది ఆమె చెప్పినట్లు ఫోన్ స్క్రీన్ మీద మీద ఉమ్ముతూ ఫోన్ లాక్ చేసింది. అందరు చూస్తుండగానే ఫోన్ పై ఉమ్ముతూ సెల్ ఫోన్ లాక్ తీసింది. మొదట్లో ఆమె చెబితే ఎవరూ నమ్మలేదు గానీ తర్వాత యువతి అలా చేసేసరికి అక్కడి వారు షాకయ్యారు. ఆమె స్పెషల్ ట్యాలెంట్ను అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

చదవండి: క్లాస్‌లో అందరి ముందే లవర్‌కు ముద్దుపెట్టిన అబ్బాయి.. తరువాత ఏం జరిగిందంటే..

మరిన్ని వార్తలు