ఈ పిల్ల తెలివి మామూలుగా లేదు..

3 Jun, 2021 20:50 IST|Sakshi

వాషింగ్టన్‌: పిదపకాలం పిదప బుద్ధులు అన్న సామెతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు నేటి పిల్లలు. తమకు కావాల్సిన దాని కోసం ఏం చేయాలో వాళ్లకు బాగా తెలుసు. ట్రెండ్‌ను ఫాలో కాకుండా.. సెట్‌ చేయటంలో ఆరితేరారు. అమెరికాకు చెందిన లియోనా కూడా అంతే! తన బర్త్‌డే కేకును మొత్తంగా దక్కించుకోవటానికి అద్భుతమైన ప్లాన్‌ వేసింది. సోషల్‌ మీడియా సెలెబ్రిటీగా మారిపోయింది.  

వివరాలు.. అమెరికా, మిన్నిసోటాలోని సేయింట్‌ పాల్‌కు చెందిన లియోనా ఫేయ్‌ అనే చిన్నారి.. కొద్ది రోజుల క్రితం మూడవ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. తన బర్త్‌డేకు ఎలాంటి కేకు కావాలో కూడా తనే చెప్పింది. వాల్ట్ డిస్నీ సంస్థ రూపొందించిన ప్రముఖ చిత్రం ‘లయన్‌ కింగ్‌’ సినిమాలోని ముఫాసా మరణ సన్నివేశాన్ని కేక్‌గా తయారు చేయించింది. సినిమా చూసిన వారికి ఆ సన్నివేశం కళ్లకు కడుతుంది. చిన్నారి ఆ కేకును ఎందుకలా తయారు చేయించమని చెప్పిందో పాప మేనమామ వివరిస్తూ.. ‘‘ మా మేనకోడలు మూడవ పడిలోకి అడుగుపెట్టింది.

లయన్‌ కింగ్‌ కేకు తయారు చేయించమని తను అడిగింది.. ఎందుకంటే! దాన్ని చూసిన వారు విషాదం కారణంగా తినటానికి ఇష్టపడరు. దీంతో మొత్తం లియోనా తినేయాలని ప్లాన్’’ అని ట్విటర్‌లో రాసుకొచ్చాడు. ఈ కేకుపై ఆమె తల్లి ఎలిసన్‌ మాట్లాడుతూ.. ‘‘ లయన్‌ కింగ్‌ కేకు తయారు చేయించటానికి నిజంగా చాలా ఇబ్బంది పడ్డా. బేకరీ వాళ్లు నన్ను ఓ భయంకరమైన తల్లి అనుకుంటారేమోనని’’ అని చెప్పింది. కేకు తయారు చేసిన బేకరీ వాళ్లు కూడా పిల్ల వింత ప్రవర్తనకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి : 2 మిలియన్ల వ్యూస్‌: ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తోన్న యువతి

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు