ఇతనో గజిని, భార్యని కూడా మర్చిపోయాడు.. ఆమె ఏం చేసిందంటే?

17 Jun, 2021 18:49 IST|Sakshi

వాషింగ్టన్‌: ఏ వ్యక్తికైనా అత్యంత బాధ కలిగించే విషయం ఏమిటంటే, మనం ప్రేమించే వ్యక్తికి ఆరోగ్యం క్షీణించడం. కానీ అంతకన్నా దారుణం ఏమిటంటే, అదే వ్యక్తి మనల్ని ఎవరో మరచిపోవడం. సరిగ్గా అల్జీమర్స్ అనే వ్యాధి ఉన్న వ్యక్తి పరిస్థితి అదే. ఈ వ్యాధి ఉన్న వ్యక్తి జ్ఞాపకాలు కాలంతో పాటు చెరిగిపోతుంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం అల్జీమర్‌తో బాధపడుతున్న 56 ఏళ్ల పీటర్ మార్షల్‌ జీవితంలోనూ ఇలానే జరిగింది. ఇతను అమెరికాలోని  కనెక్టికట్‌ ప్రాంతంలో నివసిస్తూ ఉంటాడు.

పీటర్‌ భార్య తెలిపిన వివరలు ప్రకారం.. తాను అప్పటికే వివాహం చేసుకున్నట్లు పీటర్ మర్చిపోయాడని అతనికి ఎంత చెప్పిన గుర్తు రాలేదని తెలిపింది. ఫలితంగా తన పెళ్లి సహా గతాన్నంతా మర్చిపోయిన అతడికి భార్య లీసా తమ పెళ్లి వీడియోను చూపించింది. అయితే ఇవేవి తనకు గుర్తు లేదని, కానీ లీసా అంటే తనకు ఇప్పడు ఇష్టమని పీటర్‌ చెప్పాడు. దీంతో వారిద్దరికి తమ కూతురు సాయంతో మరోసారి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ‘ఓహ్ హలో అల్జీమర్స్’ అనే ఫేస్ బుక్ పేజీలో పీటర్ ప్రయాణాన్ని లిసా డాక్యుమెంట్ చేసి వారి జీవితంలోని సంఘటనలను అందులో పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. తన భర్త ఇలాంటి వ్యాధితో బాధపడుతున్న అతనంటే తనకెంతో ఇష్టమని లీసా అంటోంది.

చదవండి: Joe Biden: రిపోర్టర్‌పై బైడెన్‌ సీరియస్‌.. అంత కోపమెందుకో?

A post shared by Alzheimers Caregiver Blog (@ohhelloalzheimers)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు