అమెరికా అధ్యక్షునికి కరోనా

22 Jul, 2022 03:42 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఆయనకు గురువారం పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బైడెన్‌కు స్వల్ప లక్షణాలే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ కెరైన్‌ జీన్‌–పియర్రీ ప్రకటించారు.

కరోనా లక్షణాల తీవ్రతను తగ్గించే యాంటీ వైరల్‌ డ్రగ్‌ ‘పాక్స్‌లోవిడ్‌’ను తీసుకుంటున్నారని వెల్లడించారు. అధ్యక్షుడు ప్రస్తుతం శ్వేతసౌధంలో ఐసోలేషన్‌లో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు నెల రోజుల క్రితం కరోనా సోకింది. ఆమె త్వరగానే కోలుకున్నారు.

మరిన్ని వార్తలు