ఇండో పసిఫిక్‌తో వాణిజ్య బంధం బలపడాలి

21 May, 2022 05:22 IST|Sakshi

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఆసియా టూర్‌ ప్రారంభం

దక్షిణ కొరియాలో శామ్‌సంగ్‌ కంపెనీ సందర్శన

ప్యాంగ్‌టెక్‌ (దక్షిణ కొరియా): ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ శుక్రవారం ఆసియా పర్యటన ప్రారంభించారు. దక్షిణ కొరియా, జపాన్‌లలో వారం రోజులు పర్యటించనున్న ఆయన తొలుత దక్షిణ కొరియాకు వచ్చారు. కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజ కంపెనీ శామ్‌సంగ్‌ కంప్యూటర్‌ చిప్‌ తయారీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కంపెనీ అమెరికాలోని టెక్సాస్‌లో 1500 కోట్ల అమెరికా డాలర్ల వ్యయంతో ఒక సెమి కండక్టర్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

అమెరికాలో వేధిస్తున్న కంప్యూటర్‌ చిప్‌ల కొరతను అధిగమించడం కోసమే బైడెన్‌ తన పర్యటనలో శామ్‌సంగ్‌ కంపెనీ సందర్శనకు పెద్దపీట వేశారు.  ఈ చిన్ని చిప్‌ల్లోనే ప్రపంచ సాంకేతిక పురోగతి దాగి ఉందని బైడెన్‌ వ్యాఖ్యానించారు. సాంకేతికంగా చైనాపై ఆధారపడడం తగ్గించడం కోసమే ఆయన కొరియా, జపాన్‌లలో పర్యటించనున్నారు. దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌కి బైడెన్‌ తన అభినందనలు తెలియజేశారు. వచ్చే కొన్ని దశాబ్దాల్లో ఇండో ఫసిఫిక్‌ ప్రాంతంలోనే ప్రపంచ భవిష్యత్‌ ఉందని బైడెన్‌ పేర్కొన్నారు. ఇండోç పసిఫిక్‌ ప్రాంతంతో వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకొని ఇరు ప్రాంతాల ప్రజలు మరింత సన్నిహితంగా మెలిగేలా చర్యలు తీసుకోవాలని బైడెన్‌ అన్నారు. 

మరిన్ని వార్తలు