బంపర్‌ ఆఫర్‌.. టీకా వేసుకుంటే ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ ఫ్రీ

10 Aug, 2021 20:01 IST|Sakshi

కరోనా మహమ్మారి ఎదుర్కోవడానికి వ్యాక్సినేషన్‌ కీలకమని వైద్యులేగాక ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. అయితే పలు కారణాల వల్ల ఈ ప్రక్రియ అనుకున్నంత వేగంగా జరగడం లేదనే చెప్పాలి. దీంతో అందదూ వ్యాక్సిన్‌ వేసుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వాలు కొత్త ఐడియాలు, గిఫ్ట్‌లతో ప్రజల ముందుకు వస్తున్నాయి. అమెరికా రాజ‌ధాని వాషింగ్ట‌న్‌లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం వేగం పెంచేందుకు అక్కడి అధికారులు నానా తిప్పలు పడుతున్నారు. తాజాగా ఆ ప్రాంత మేయర్‌ టీకా వేసుకున్న టీనేజర్లకు బంఫర్‌ ఆఫర్లు ప్రకటించారు. 

వ్యాక్సిన్‌ వేసుకుంటే.. ఆపిల్ ఎయిర్‌పాడ్స్‌ ఫ్రీగా ఇవ్వ‌డంతోపాటు అదృష్టం క‌లిసొస్తే 25 వేల డాల‌ర్ల స్కాల‌ర్‌షిప్ అందచేస్తామని లేదా ఐప్యాడ్ కూడా ద‌క్కే అవకాశం ఉందంటూ వాషింగ్ట‌న్ డీసీ మేయ‌ర్ మేయ‌ర్ మురియ‌ల్ బౌజ‌ర్ ప్ర‌క‌టించారు. వాషింగ్ట్‌న్‌తో పాటు చుట్టుప‌క్క‌ల ఉన్న టీనేజర్లు తొలి డోసు తీసుకుంటే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని చెప్పారు. కాగా.. ఇవాళ ఉద‌యం 10 గంట‌ల నుంచి, డీసీ యువ‌త (12-17) ఎవ‌రైతే బ్రూక్‌లాండ్ ఎంఎస్‌, సౌసా ఎంఎస్‌, జాన్స‌న్ ఎంఎస్‌ల‌లో వ్యాక్సిన్ తీసుకుంటారో వాళ్ల‌కు ఎయిర్‌పాడ్స్ ఇస్తాం. అంతేకాదు 25 వేల డాల‌ర్ల స్కాల‌ర్‌షిప్‌, ఐప్యాడ్ గెలుచుకునే అవ‌కాశం కూడా వాళ్ల‌కు ఉంటుంది అని బౌజ‌ర్ ట్వీట్ చేశారు. మీరు స్టూడెంట్ అయి ఉండి.. వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంద‌ని ఆ ట్వీట్‌లో తెలిపారు.
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు