‘భారత్‌ సహాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేం’

29 May, 2021 19:55 IST|Sakshi

వాషింగ్టన్‌:  కోవిడ్ వ్యాప్తి చెందుతున్న తొలి రోజుల్లో అమెరికాకు భారత్ బాసటగా నిలిచింద‌ని, ఈ స‌హాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేమ‌ని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకన్‌ తెలిపారు. భార‌త విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంక‌ర్‌ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న విష‌యం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఎస్‌ జైశంకర్‌ ఆ దేశ విదేశాంగ మంత్రిని క‌లిశారు. అమెరికా అధ్య‌క్షుడిగా జో బైడెన్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత ఆ దేశాన్ని పర్యటించిన తొలి భార‌తీయ విదేశాంగా మంత్రి ఎస్ జైశంక‌ర్‌.

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మేము ఐక్యంగా ఉన్నామని బ్లింకన్‌ అన్నారు. యుఎస్, భారతదేశం మధ్య భాగస్వామ్యం చాలా ముఖ్యమైనది, ప్రస్తుతం అది మరింత ముందుకు వెళ్తుందన్నారు. అంతకుముందు, జైశంకర్ యుఎస్ రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, రక్షణ భాగస్వామ్యాన్ని మరింతగా అభివృద్ధి చేయడం గురించి చర్చించారు. మా వ్యూహాత్మక ,రక్షణ భాగస్వామ్యాన్ని మరింత అభివృద్ధి చేయడం గురించి సమగ్ర సంభాషణ జరిగిందని సమావేశం తరువాత ట్వీట్ చేస్తూ, వారితో కలిసి ఉన్న ఫోటోను జైశంకర్ పంచుకున్నారు.

చదవండి: రండి.. వ్యాక్సిన్‌ వేసుకోండి.. 840 కోట్ల ప్రైజ్‌మనీ గెలుచుకోండి

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు