సీటు బెల్ట్‌ పెట్టుకోమన్నందుకు.. పళ్లు రాలగొట్టింది

4 Jun, 2021 14:53 IST|Sakshi

సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో చోటు చేసుకున్న ఘటన

వాషింగ్టన్‌: సీటు బెల్ట్‌ పెట్టుకోమన్నందుకు ఎయిర్‌హోస్టెస్‌ పళ్లు రాలగొట్టింది ఒక మహిళ. ఈ సంఘటన అమెరికా సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో చోటు చేసుకుంది. ‘‘విమానం ల్యాండ్ అవ్వబోతుంది. సీట్‌ బెల్ట్‌ ధరించండి’’ అని చెప్పినందుకు సదరు ప్రయాణికురాలు ఇంత దారుణానికి తెగబడింది. విమానంలో ఉన్న ప్యాసింజర్‌ ఒకరు దీన్ని వీడియో తీసి షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..

విమానం ల్యాండ్‌ అవబోతుందనగా ఎయిర్‌ హోస్టెస్‌ విమానంలో ఉన్న 28 ఏళ్ల ప్రయాణికురాలు వైవియానా క్వినోనెజ్‌ని సీట్‌ బెల్ట్‌ ధరించాల్సిందిగా కోరింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి లోననై క్వినోనెజ్‌ని ఫ్లైట్‌ అటెండెంట్‌ మీద దాడి చేసింది. ఆమె ముఖం మీద గట్టిగా కొట్టింది. పక్కనున్న ప్రయాణికులు ఆపడానికి ప్రయత్నించారు వీలు కాలేదు. ఓ ప్రయాణికుడు ఎయిర్‌ హోస్టెస్‌ మీద ఇలా దాడి చేయడం మంచి పద్దతి కాదని వారించాడు. కానీ ఆ ప్రయాణికురాలు వారి మాటలు వినిపించుకోలేదు. ఈ డాడిలో ఎయిర్‌హోస్టెస్‌ రెండు పళ్లు ఊడిపోయాయి, ఆమె ముఖానికి తీవ్ర గాయలైనట్లు తెలిసింది

శాన్ డియాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగిన తర్వాత క్వినోనెజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత ఆమెను బ్యాటరీ కోసం అరెస్టు చేసినట్లు పోర్ట్ ఆఫ్ శాన్ డియాగో హార్బర్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

చదవండి: ఎయిర్ హోస్టెస్‌ వ్యభిచార ప్రచారం: విమానంలో..
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు