Viral Video : చీరకట్టులో గుర్రపు స్వారీ

8 Jun, 2021 08:44 IST|Sakshi

యూట్యూబ్‌లో మోనాలీసా సంచలనం

సంప్రదాయ దుస్తుల్లో సాహసాలు

ఆకట్టుకుంటున్న డ్రైవింగ్‌ వీడియోలు

వెబ్‌డెస్క్‌: ఒడిషాకు చెందిన మోనాలీసా ఇప్పుడు యూట్యూబ్‌ సంచలనంగా మారింది. యూట్యూబర్‌గా ఆమె చేస్తున్న వీడియోలు మిలియన్ల కొద్ది వ్యూస్‌ సాధిస్తున్నాయి. వెబ్‌ దునియాలో దుమ్మురేపుతున్నాయి. ఇంతగా ఆమె వీడియోలు సంచనలం కావడానికి కారణం,  అందులోని ప్రత్యేకతలు ఏంటో ఓ సారి చూద్దాం..

యూట్యూబర్‌
యూట్యూబ్‌ వచ్చిన తర్వాత చాలా మంది సొంత ఛానళ్లు స్టార్‌ చేసి వీడియోలు చేస్తున్నారు. అయితే ఇందులో యూనిక్‌ పాయింట్‌ ఉన్న ఛానళ్లే నిలదొక్కుకుంటున్నాయి. మోనాలీసా వీడియోల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సంప్రదాయం. అవును సంప్రదాయ దుస్తుల్లో ఆల్‌మెస్ట్‌ అడ్వెంచరస్‌ పనులు చేస్తూ.. వాటిని తన యూట్యూబ్‌లో పెడుతూ సంచలనం సృష్టిస్తోంది. ఒడిషా సంప్రదయా పద్దతిలో చీర కట్టి , బొట్టు పెట్టి సాధారణ మహిళలా కనిపిస్తూ... ఆమె రూపొందిస్తున్న వీడియోల్లోని కొత్తదనం ఆకట్టుకుంటోంది. దీంతో మామూలు గృహిణి స్థాయి నుంచి యూట్యూబ్‌ స్టార్‌గా ఆమె ఎదిగింది. 

సంప్రదాయ సాధికారత
ఒడిషాలోని జాజ్‌పూర్‌ జిల్లా జాహర్‌ మోనాలీసా సొంతూరు. ఆమె భర్త బద్రి నారాయణ్‌ భద్ర క్రియేటివ్‌ వర్కర్‌. భర్త ప్రోత్సాహంతో  సొంత యూట్యూబ్‌ ఛానల్‌ని 2016లో ప్రారంభించింది. సంప్రదాయ చీరకట్టులో గుర్రపుస్వారీ చేస్తూ ఆమె అప్‌లోడ్‌ చేసిన వీడియోకు నెటిజన్లు బ్రహ్మరథం పట్టారు. ఆమె గుర్రపు స్వారీ వీడియోను మహిళా సాధికారతకు చిహ్నాలైన ? లక్ష్మీబాయి, రాణి రుద్రమ, రజియా సుల్తానాలను గుర్తుకు తెచ్చింది.

క్లాసిక్‌ అడ్వెంచర్‌
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారనడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది మోనాలీసా. ముఖ్యంగా సంప్రదాయ చీరకట్టులోనే ఆమె చేసిన ట్రాక్టర్‌తో పొలం దున్నే వీడియో, ట్రక్‌ డ్రైవింగ్‌, బుల్లెట్‌ డ్రైవింగ్‌, వోల్వో బస్‌ డ్రైవింగ్‌ వీడియోలు లక్షల కొద్ది వ్యూస్‌ సాధించాయి. క్లాసిక్‌ ప్లస్‌ అడ్వెంచర్‌ ఫ్యూజన్‌గా నెటిజన్లకు తెగ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఆమె ఛానల్‌కి  22 లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉండగా నెలకు రూ. 1.5 లక్షలు సంపాదిస్త్నుట్లు సమాచారం.

వివక్ష రూపుమాపాలనే - మోనాలీసా
మహిళలపై సమాజంలో ఉన్న వివక్షను రూపుమాపాలన్నదే నా లక్క్ష్యం. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తారని చెప్పాలనుకున్నాను. సంప్రదాయబద్ధంగా ఉంటూనే గుర్రపుస్వారీ చేయడంతో పాటు వివిధ వాహనాలను డ్రైవ్‌ చేయోచ్చని నిరూపించాను. నా ప్రయత్నాలకు నా భర్త సహకారం తోడవటంతో యూట్యూబర్‌గా మారాను. 

మరిన్ని వార్తలు