బడికి వెళ్లే పిల్లల విషయంలో జాగ్రత్త.. క్షణకాలం నిర్లక్ష్యం ప్రాణాలకే ముప్పు!

26 Sep, 2022 19:54 IST|Sakshi

కొన్నిసార్లు మనుషులు చేసే తప్పిదాలు.. తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. క్షణికావేశం, క్షణకాల నిర్లక్ష్యం కారణంగా ఎదుటివారి ప్రాణాలు గాలిలో కలిసే అవకాశం ఉంటుంది. ఇలాంటి వీడియోనే ఒకటి తాజాగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ స్కూల్‌ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా చిన్నారి తీవ్రంగా గాయపడింది. 

వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన జెఫ్ఫర్‌సన్‌ పబ్లిక్‌ స్కూల్‌ బస్సు నుండి ఓ చిన్నారి(​‍6) కిందకు దిగుతోంది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్‌.. డోర్‌ ఓపెన్‌ చేసింది. కాగా, చిన్నారి పూర్తిగా స్టెప్స్‌ దిగకముందే.. డోర్‌ క్లోజ్‌ కావడంతో ఆమె బ్యాగ్‌.. డోర్‌ మధ్యలో చిక్కుకుపోతుంది. దీంతో, బాలిక.. కిందకు దిగకుండా అలాగే నిల్చుడిపోతుంది. అది గమనించని డ్రైవర్‌.. బస్సును స్టార్ట్‌ చేసి వెళ్లిపోతుంటాడు. 

దీంతో, చిన్నారి బస్సు డోర్‌కు వేలాడుతూనే వస్తుంది. ఇలా దాదాపు 1000 అడుగుల దూరం వచ్చాక.. బస్సులో ఉన్న వారు చిన్నారిని చూసి కేకలు వేయడంతో డ్రైవర్‌ బస్సును నిలిపివేస్తుంది. ఈ ప్రమాదంలో బాలిక తీవ్రంగా గాయపడుతుంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలిస్తారు. ఇక, ఈ ఘటన అనంతరం డ్రైవర్‌ను విధుల నుంచి తొలిగిస్తారు. అలాగే, పాఠశాల యాజమాన్యం చిన్నారి పేరెంట్స్‌కు దాదాపు 5 మిలియన్ల డాలర్లను నష్టపరిహారంగా ఇచ్చినట్టు సమాచారం. కాగా, ఈ ప్రమాదం 2015లో జరిగింది. తాజాగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు పిల్లల విషయంలో పేరెంట్స్‌ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు