కథ అడ్డం తిరిగింది.. రష్యన్‌ యుద్ధ నౌకను పేల్చేసిన ఉక్రెయిన్‌ ఆర్మీ

9 May, 2022 10:58 IST|Sakshi

కీవ్‌: రష్యా ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్‌ మొదలుపెట్టి రెండు నెలలు దాటింది. యుద్ధం ప్రారంభంలో వార్‌ వన్‌సైడ్‌గా రష్యా వైపే ఉన్నట్లు కనిపించినా రోజులు గడిచే కొద్దీ ఉక్రెయిన్‌ కూడా రష్యన్‌ బలగాలకు ధీటుగా బదులిస్తోంది. ఈ మారణహోమాని ముగింపు ఎప్పుడు పడనుందో తెలియడం లేదు. ఇప్పటికే యుద్ధం కారణంగా కోట్లలో ఆస్తులు నష్టం, లక్షల్లో నిరాశ్రయులు కాగా వేల సంఖ్యల్లో ప్రజలు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

తాజాగా నల్ల సముద్రంలోని స్నేక్ ఐలాండ్ సమీపంలో రష్యాకు చెందిన మరో యుద్ధ నౌకను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ వీడియోని షేర్‌ చేశారు. ఉక్రెయిన్‌ సాయుధ డ్రోన్ సాయంతో రష్యా నియంత్రణలో ఉన్న చిన్న ద్వీపంలోని సెర్నా ప్రాజెక్ట్ ల్యాండింగ్ క్రాఫ్ట్‌తో పాటు వారి క్షిపణి రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. రష్యాకు అత్యంత ముఖ్యమైన, శక్తివంతమైన యుద్ధనౌకలలో ఒకటిని తాము పేల్చేశామని, ఇది తమకు పెద్ద విజయమని ఉక్రెయిన్ తెలిపింది. ఈ షిప్‌ పేల్చినప్పుడు రికార్డ్‌ అయిన బ్లాక్ అండ్ వైట్ ఫూటేజ్‌ను ఉక్రెయిన్‌ అధికారులు ట్విటర్‌లో విడుదల చేశారు. కాగా మే మొదటి వారంలో న‌ల్లస‌ముద్రంలో ఉన్న రష్యన్‌ యుద్ధ నౌక‌ను పేల్చిన‌ట్లు ఉక్రెయిన్ వెల్లడించిన విష‌యం తెలిసిందే.

చదవండి: Dmitry Rogozin: సంచలన వ్యాఖ్యలు.. మేము తలచుకుంటే అరగంటలో నాటో దేశాలన్నీ ధ్వంసం

మరిన్ని వార్తలు