వామ్మో.. గాల్లో బంతిలా ఎగిరి కిందపడ్డ ‘సివంగి’

23 Jun, 2021 11:59 IST|Sakshi

డొడొమా: అడవిలో ఉండే జంతువులు కూడా, మనుషుల్లాగానే నిరంతరం మనుగడ కోసం పోరాడుతుంటాయి. ఈ క్రమంలో మాంసాహార జంతువులు శాఖాహర జంతువులను.. శాఖాహర జంతువులు గడ్డి, చెట్ల ఆకులను, ఫలాలను తిని జీవిస్తాయనే విషయం మనకు తెలిసిందే. అయితే, ఈ పోరాటంలో ఒక జీవి వేటలో మరొక జీవి బలవ్వాల్సిందే.. ఇదే ఆటవిక ధర్మం. కాగా, ఇప్పటికే అడవిలోని సింహం, పులులు, చిరుత పులులు తదితర జంతువులు, ఇతర జీవులను వేటాడటాన్ని మనం అనేక వీడియోల్లో చూస్తూ ఉంటాం. 

ఈ పరస్పర దాడుల్లో ఒక్కొసారి.. క్రూరమృగాల వేటకు శాఖాహార జీవులు బలైతే,  మరోసారి శాఖాహర జంతువులు మాంసాహార జంతువుల బారి నుంచి తెలివిగా తప్పించుకున్న వీడియోలను మనం సోషల్‌ మీడియాలో చూస్తూ ఉంటాం. అయితే, ప్రస్తుతం ఈ వీడియో కూడా ఆ కోవకు చెందినదే. ఈ సంఘటన టాంజానియాలోని అడవిలో జరిగింది. దీనిలో ఒక జీబ్రా దట్టమైన అడవిలో గడ్డిని మేస్తుంది. ఈ క్రమంలో ఒక ఆడ సింహం జిబ్రాను దూరం నుంచి గమనించింది. ఈ జీబ్రా ఒక్కటే ఉండటంతో.. మెల్లగా ఒక్కొ అడుగు ముందుకు వేస్తు జీబ్రా దగ్గరకు వచ్చింది. పాపం.. జీబ్రా ధ్యాస మాత్రం మేత మీదే ఉంది.

అప్పుడు సివంగి వెంటనే జీబ్రామీద దాడి చేసింది. దీంతో జీబ్రా ఒక్కసారిగా తేరుకొని.. సింహనికి చిక్కకుండా అక్కడి నుంచి పరిగెత్తింది. ఈ క్రమంలో ఆడసింహం అమాంతం జీబ్రాపైకి దూకింది. అప్పుడు.. జీబ్రా .. తన బలమైన వెనుక కాళ్లతో ఆడసింహన్ని బలంగా ఒక్క తన్నుతన్నింది. దీంతో పాపం..ఆ ఆడసింహం గాల్లో ఎగిరి దూరంగా పడింది. పాపం... సివంగి ఈ ప్రతి దాడిని ఊహించి ఉండదు. కాగా, ఈ వీడియోను మాసాయి లెజెండ్‌ అనే సఫారీ టీమ్‌ ఇన్‌స్టాలోని  వావో ఆఫ్రికా పేజీలో పోస్ట్‌ చేశారు. దీంతో ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఏమన్నా తన్నిందా..’, ‘ పాపం.. సివంగి.. నాలుగైదు అడుగుల దూరం పడుంటుంది..’,‘ సివంగి వేట మిస్‌..’, ‘గాల్లో బంతిలాగా ఎగిరి కింద పడింది..’ ‘జీబ్రా ఆయుష్యు గట్టిదే..’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

చదవండి: వైరల్‌: జాలరికి జాక్‌పాట్‌.. చేప కడుపలో ఊహించని బహుమతి

A post shared by Waow Africa (@waowafrica)

మరిన్ని వార్తలు