చలో వియన్నా

24 Jun, 2022 04:16 IST|Sakshi

అత్యంత నివాసయోగ్య నగరాల్లో నెంబర్‌ వన్‌ 

ఎకానమిస్ట్‌ నివేదిక

పారిస్‌: భూమ్మీద అత్యంత నివాసయోగ్య నగరంగా ఆస్ట్రియా రాజధాని వియన్నా నిలిచింది. జీవన ప్రమాణాల్లో సుస్థిరత, మౌలిక సదుపాయాలు, మంచి ఆరోగ్య వ్యవస్థ, విస్తృతమైన ఉపాధి అవకాశాలు, వినోదం–విజ్ఞానం–సంస్కృతి తదితర ప్రామాణికాల ఆధారంగా ఎకానమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఈయూఐ) ఏటా ఈ ర్యాంకులిస్తుంది. గతేడాది టాప్‌లో ఉన్న అక్లండ్‌ (న్యూజిలాండ్‌)ను తోసిరాజని వియన్నా తొలి స్థానంలోకి వచ్చినట్టు ఎకనామిస్ట్‌ పత్రిక ప్రచురించింద

కరోనా దెబ్బకు ఆక్లండ్‌ 34వ స్థానానికి పడిపోయింది. వియన్నా 2018, 2019 ల్లో నూ తొలి స్థా నంలో నిలిచింది. కరో నా వచ్చిన కొత్తల్లో రెస్టారెంట్లు, మ్యూజియంలు తదితరాలన్నీ మూతబడటంతో 2020లో 12వ స్థానానికి పడిపోయింది. సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఈసారి మొదటి స్థానంలో నిలిచిందని నివేదిక వెల్లడించింది. డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హగెన్‌ రెండో స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్‌కు చెందిన జ్యురిచ్, కెనడాలోని కేల్గరీ నగరాలు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. పారిస్‌ 19 స్థానంలో, లండన్‌ 33, మిలన్‌ (ఇటలీ) 49, న్యూయార్క్‌ 51వ స్థానంలో నిలిచాయి.

టాప్‌ 10 నగరాలు
1. వియన్నా (ఆస్ట్రియా)
2. కోపెన్‌హగెన్‌ (డెన్మార్క్‌)
3. జ్యురిచ్‌ (స్విట్జర్లాండ్‌)
4.     కాల్గరీ (కెనడా)
5. వాంకోవర్‌ (కెనడా)
6. జెనీవా (స్విట్జర్లాండ్‌)
7. ఫ్రాంక్‌ఫర్ట్‌ (జర్మనీ)
8. టొరంటో (కెనడా)
9. ఆమ్‌స్టర్‌డామ్‌ (నెదర్లాండ్స్‌)
10. ఒసాకా (జపాన్‌)
 మెల్‌బోర్న్‌ (ఆస్ట్రేలియా)  

     

మరిన్ని వార్తలు