ఇలాంటి క్యాచ్‌ నెవర్‌‌ బిఫోర్‌ ఎవర్ ఆ‌ఫ్టర్‌

3 Mar, 2021 19:04 IST|Sakshi
12వ అంతస్తు నుంచి కిందకు పడిపోతున్న చిన్నారి

12వ అంతస్తు నుంచి పడిపోయిన చిన్నారి

చాకచక్యంగా బాలికను కాపాడిన డెలివరీ డ్రైవర్‌

హనోయి: క్యాచ్‌ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది క్రికెట్‌. బ్యాట్స్‌మెన్‌ బాదిన బాల్‌ని క్యాచ్‌ పట్టడం కోసం మిగతా ఆటగాళ్లంతా దీక్షగా ఎదురు చూస్తుంటారు. అయితే క్రికెట్‌లో క్యాచ్‌ పడితే ఔట్‌ అవుతారు.. కానీ ఇక్కడ ఓ వ్యక్తి పట్టిన క్యాచ్‌ ఓ ప్రాణాన్ని నిలబెట్టింది. ప్రస్తుతం అతడిని అందరు దేవుడివని పొగుడుతున్నారు. ఇంతకు ఆ వ్యక్తి పట్టిన క్యాచ్‌ ఏంటి.. అసలు ఏం జరిగింది అంటే ఇది చదవాల్సిందే.. 

వియాత్నంకు చెందిన న్గుయెన్ న్గోక్ మన్హ్(31) డెలివరీ డ్రైవర్‌‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గత ఆదివారం రాజధాని హనోయ్‌లో ఓ ప్యాకేజీని డెలివరీ చేయడం కోసం ట్రక్కులో కూర్చొని వెయిట్‌ చేస్తున్నాడు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో మన్హ్‌కు చిన్నారి ఏడుపు వినిపించింది. ఎక్కడో పిల్లలు కోపంగా అరుస్తున్నారని భావించాడు మన్హ్‌. ఇంతలో చుట్టు పక్కల ఉన్న వారు కూడా కేకలు వేయడంతో ఏం జరిగిందోనని కిటికి తెరిచి చూసి ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు మన్హ్‌. రెండేళ్ల చిన్నారి ఒకరు 12వ అంతస్తు నుంచి కిందకు పడిపోవడం గమనించాడు. బాలిక అపార్ట్‌మెంట్‌ పక్కనే ఉన్న గోడ మీద పడి వేలాడుతూ ఉంది. ఏ మాత్రం ఆలస్యం అయినా చిన్నారి కింద పడిపోయేది. 

ఈ లోపు చిన్నారి తండ్రి ఆమెను కాపాడటం కోసం రంగంలోకి దిగాడు. అపార్టమెంట్‌ పక్కన ఉన్న గోడ దూకి బిడ్డను కాపాడాలని ప్రయత్నించాడు. అయితే అదృష్టం కొద్ది బాలిక వెళాడుతున్న గోడ పక్కనే మన్హ్‌ ట్రక్కులో కూర్చొని ఉన్నాడు. ఒక్కసారిగా అక్కడ జరగబోయే దారుణాన్ని ఊహించుకుని వెంటనే అప్రమత్తమయ్యాడు. ఎంతో చాకచక్యంగా చిన్నారిని ఒడిసి పట్టుకున్నాడు. ఆ తర్వాత బాలికను తల్లిదండ్రులకు అప్పగించాడు. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించగా.. ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు కానీ నడుము కొంచెం పక్కకు జరిగిందని తెలిపారు వైద్యులు. ప్రస్తుతం చిన్నారికి వైద్యం అందిస్తున్నారు. 

ఇక ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. హీరో, సూపర్‌ మ్యాన్‌ అంటూ మన్హ్‌ని ప్రశంసిస్తున్నారు వియాత్నం ప్రజలు, నెటిజనులు. సదరు చిన్నారి తన ఇంటి బాల్కనీలో ఆడుకుంటూ పట్టుతప్పి కింద పడిపోయింది. అదృష్టం బాగుండటంతో ప్రాణాపాయం తప్పింది. 

చదవండి:
17 ఏళ్లకే ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు, కానీ ఇప్పుడు
ఆ ​క్యాచ్‌ చూస్తే ఔరా అనాల్సిందే..

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు