ఇంటర్వ్యూలలో ఫెయిల్‌.. బాధతో 9 ప్లాస్టిక్‌ సర్జరీలు

4 Mar, 2021 12:05 IST|Sakshi
డూ కూయెన్..‌ ప్లాస్టిక్‌ సర్జరీకి ముందు.. ఆ తర్వాత

హానోయ్‌ : జాబ్‌ ఇంటర్వ్యూలలో విఫలమవ్వటానికి తన ముఖమే కారణమని భావించిన ఓ యువకుడు ప్లాస్టిక్‌ సర్జరీలను ఆశ్రయించాడు. దాదాపు 9 సర్జరీలతో అందంగా తయారై అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు. ఇంతకీ సంగతేటంటే.. వియత్నాంకు చెందిన 26 ఏళ్ల డూ కూయెన్‌ అనే యువకుడు జాబ్‌ ఇంటర్వ్యూలకు వెళ్లిన సమయంలో ఘోర అవమానాలకు గురయ్యాడు. ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు అతడి ముఖాన్ని చూసి గేలి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన డూకు తన ముఖంపై అసహ్యం వేసింది. ఎలాగైనా ముఖాన్ని మార్చుకోవాలని అనుకున్నాడు. మేకప్‌ ఆర్టిస్ట్‌గా పని చేసి సంపాదించిన దాదాపు 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 9 ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకున్నాడు. సర్జరీల తర్వాత అతడి రూపు రేఖలు పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా.. అందంగా తయారయ్యాయి.

అతడు తన మునుపటి, తర్వాతి ఫొటోను పక్కపక్కన పెట్టి టిక్‌టాక్‌లో షేర్‌ చేయగా ఎవరూ గుర్తు పట్టలేకపోయారు. ఆ రెండు ఫొటోలు డూవని తెలిసిన తర్వాత ‘‘అది నువ్వేనా?!’’ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్లాస్టిక్‌ సర్జరీల తర్వాత మొదటి సారి ఇంటికి వచ్చినపుడు కుటుంబసభ్యులు కూడా అతడ్ని గుర్తుపట్టలేకపోయారు. దీనిపై డూ కూయెన్‌ మాట్లాడుతూ.. ‘‘ ఎల్లప్పుడూ ధృడ చిత్తంతో ఉండండి. మిమ్మల్ని కాన్ఫిడెంట్‌గా ఉంచే అందంకోసం అన్వేషించండి. నా దృష్టిలో అందం అంటే.. అద్దంలో మనల్ని మనం చూసుకున్నపుడు సంతృప్తిగా.. కాన్ఫిడెంట్‌గా ఉండాలి’’ అని చెప్పాడు.

చదవండి : గుర్రం అంటే ఆయనకు ప్రాణం.. అందుకే..

 వైరల్‌ : నీ టైం బాగుంది ఇంపాల

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు