30కి పైగా దేశాల్లో కొత్త స్ట్రెయిన్‌

4 Jan, 2021 05:33 IST|Sakshi

న్యూఢిల్లీ: 2020 చివర్లో యూకేలో గుర్తించిన కరోనా కొత్త స్ట్రెయిన్‌ వేగంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. తాజాగా శనివారం వియత్నాంలో ఈ స్ట్రెయిన్‌ను గుర్తించారు. దాంతో తక్షణమే అంతర్జాతీయ విమాన రాకపోకలపై ఆ దేశం నిషేధం విధించింది. ఇప్పటివరకు దాదాపు 30కి పైగా దేశాల్లో ఈ కొత్త వైరస్‌ ప్రకంపనలను సృష్టిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కారణంగా.. ఈ వైరస్‌పై అత్యంత అప్రమత్తత అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ స్ట్రెయిన్‌ కారణంగా యూకేలో కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం, దాంతో, అక్కడ కఠిన ఆంక్షలను అమలు చేయడం తెలిసిందే. అమెరికాలోనూ దాదాపు 3 రాష్ట్రాల్లో ఈ స్ట్రెయిన్‌ను గుర్తించారు. అది మరిన్ని రాష్ట్రాలకు విస్తరించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ వైరస్‌ స్ట్రెయిన్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందే కానీ, గత వైరస్‌ కన్నా ఎక్కువ ప్రాణాంతకం కాదని వైద్యులు చెబుతున్నారు. అలాగే, ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన, త్వరలో మార్కెట్లోకి రానున్న టీకాలు ఈ వైరస్‌పై కూడా సమర్ధవంతంగా పనిచేస్తాయని చెబుతున్నారు. వైరస్‌లో జన్యు పరివర్తనాలు సహజమేనని వివరిస్తున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు