జూ నుంచి తప్పించుకుంది; కట్‌చేస్తే షాపింగ్‌మాల్‌లో

9 Jul, 2021 12:20 IST|Sakshi

లూసియానా: కారా అనే 12 అడుగుల కొండచిలువ రెండు రోజుల క్రితం లూసియానాలోని బ్లూ అక్వేరియం జూ నుంచి తప్పించుకుంది. ఎంతో పకడ్బందీగా ఉండే ఎన్‌క్లోజర్‌ నుంచి ఎలా తప్పించుకుందో అధికారులకు అర్థం కాలేదు. పాపం రెండు రోజుల నుంచి నిద్రాహారాలు మాని అధికారులు కారాను వెతికే ప్రయత్నం చేశారు. అలా చివరికి ఒక షాపింగ్‌మాల్‌లో గోడ సీలింగ్‌లో కారా దాక్కున్నట్లు వారికి తెలిసింది. ఇంకేముంది షాపింగ్‌మాల్‌ నిర్వాహకులు అనుమతితో వారి గోడకున్న సీలింగ్‌ను పగుగొట్టి దాని నుంచి కొండచిలువను బయటికి తీశారు. ఆ కొంచిలువ ఇక్కడే ఉంటే ప్రమాదమని.. వెంటనే బ్లూ జూ అక్వేరియంకు తరలించి పటిష్టమైన ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. దీంతో కథ సుఖాంతమైంది.

''మాకు కారా తప్పిపోయిందని తెలిసినప్పటి నుంచి దానిని వెతికే ప్రయత్నంలో పడ్డాం. రెండురోజుల పాటు నిద్రహారాలు మాని కారా కోసం గాలించాం. చివరికి గురువారం ఒక షాపింగ్‌మాల్‌లో చిన్న సందు ద్వారా గోడ సీలింగ్‌లోకి వెళ్లి దాక్కున్నట్లు తెలిసింది. కారాను సురక్షితంగా బయటికి తీసి ఎన్‌క్లోజర్‌లో పెట్టేశాం'' అంటూ జూ ప్రధాన అధికారి రోండా స్వాన్సన్‌ చెప్పుకచ్చాడు. కాగా కారాను (కొండచిలువ) సీలింగ్‌ నుంచి బయటికి తీసిన వీడియోనూ బ్లూ జూ అక్వేరియం తమ ఫేస్‌బుక్‌లో షేర్‌ చేయగా.. అది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను చాలా మంది వీక్షించారు. వీలైతే మీరు ఒక లుక్కేయండి.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు