భయానకం: 4 అడుగుల పామును మింగిన మహిళ..

31 Aug, 2020 19:27 IST|Sakshi

కొందరు నోరు తెరచి, గుర్రు కొడుతూ నిద్ర పోతుంటారు. ఆ సమయంలో వారికి తెలియకుండానే వారి నోట్లోకి ఈగలు, జిల్ల పురుగులు వెళ్లడం మనకు తెల్సిందే. కానీ రష్యాలోని డజెస్థాన్‌ ప్రాంతంలోని లెవాషి గ్రామానికి చెందిన ఓ యువతి అలా నిద్రపోయినప్పుడు ఆమెకు తెలియకుండానే ఆమె నోట్లోకి ఏకంగా నాలుగు అడుగుల పొడవున్న  పాము వెళ్లింది. తెల్లవారిన తర్వాత ఆమెకు కడుపులో ఏదో తిరుగుతున్నట్టు, కడుపంతా తిప్పుతున్నట్లు అనిపించి సమీపంలోని ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి వైద్య సిబ్బంది ఆమె కడుపును స్కాన్‌ చేయగా, కడుపులో ఏదో పాములాంటి జీవి ఏదో ఉన్నట్లు కనిపించింది. ఆమెను ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లాక ఓ  డాక్టర్‌ ఆమె నోట్లోకి పైపును పంపించి వినూత్న పద్ధతిలో ఆపరేషన్‌ చేశారు. (పాము ముంగిసల ఫైట్‌ వీడియో వైరల్‌!)

పైపుతోపాటు బయటకు వచ్చిన పాము కొసను పట్టుకొని ఓ నర్సు భయం, భయంతో  ఆ పాము పూర్తిగా బయటకు లాగేసింది. ఆ పామును వైద్య చెత్త పడేసే బకెట్లో వేశారు. అప్పటికీ ఆ పాముకు ప్రాణం ఉందా, లేదా అన్న విషయాన్ని అక్కడి వారు ఎవరు పట్టించుకోలేదు. బాధితురాలి పేరునుగానీ, ఆమె లోపలికి దూరింది ఎలాంటి రకమైన పామో వైద్యులు వెల్లడించలేదు. ఈ అరుదైన ఆపరేషన్‌ను వీడియోలో చిత్రీకరించిన ఆ ఆస్పత్రి సిబ్బంది, ఆ తర్వాత దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా, అది వైరల్‌ అవుతోంది. లెవాషి గ్రామంలో ఇలాంటి ఘటనలు సర్వ సాధారణమేనట. ఆరు బయట పడుకోవడం వల్ల నోట్లో, ముక్కుల్లో పాములు, క్రిమి కీటకాలు దూరుతాయని స్థానికులు తెలిపారు. సముద్ర మట్టానికి 4,165 అడుగుల ఎత్తులో ఉన్న ఆ గ్రామంలో 11,500 మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు భ‌య‌భ్రాంతుల‌కు గురవుతున్నారు. మరి కొందరికి అయితే వాంతులవుతున్నాట్లు అనిపిస్తోంది. మీరు కూడా చూసేటప్పుడు కాస్తా జాగ్రత్త..

మరిన్ని వార్తలు