ఇండియాకు మాల్దీవులు షాక్‌.. అయోమ‌యంలో బీటౌన్ లవ్‌బ‌ర్డ్స్‌

26 Apr, 2021 15:57 IST|Sakshi

భార‌త్‌లో క‌రోనా వైర‌స్ రెండో ద‌శ తీవ్రంగా విరుచుకుప‌డుతోంది. రోజూ మూడు ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి.  దేశంలో క‌రోనా వేగంగా వ్యాపిస్తున్న‌ నేపథ్యంలో జ‌ర్మ‌నీ, ఇట‌లీ, ఇరాన్‌, సింగ‌పూర్‌, నెదర్లాండ్ , బంగ్లాదేశ్ వంటి దేశాలు ఇప్పటికే భార‌త ప్ర‌యాణికుల‌పై ఆంక్ష‌లు విధించాయి. భార‌త్ నుంచి వ‌చ్చే విమానాలు ర‌ద్దు చేశాయి. తాజాగా ఈ జాబితాలోకి మాల్దీవులు చేరింది. భార‌త్ నుంచి మాల్దీవుల‌కు వ‌చ్చే అ‌న్ని విమాన‌ల‌ను నిలిపివేస్తున్న‌ట్లు ఆదివారం ప్ర‌క‌టించింది.  ఈ మేర‌కు మాల్దీవులు ప‌ర్యాట‌క మంత్రిత్వశాఖ ట్విట‌ర్ ద్వారా అధికారికంగా వెల్లడించింది.

ఆ ఆంక్ష‌లు ఏప్రిల్ 27 నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని పేర్కొంది. భార‌త ప‌ర్యాట‌కులెవ‌రూ మాల్దీవుల్లోని హోట‌ళ్లు, రిసార్ట్‌లు, గెస్ట్ హౌజ్‌ల్లో బ‌స చేయ‌వ‌ద్ద‌ని నిషేధం విధించింది. త‌మ ప‌ర్యాట‌క రంగాన్ని సుర‌క్షితంగా ఉంచ‌డానికి చేస్తున్న ఈ ప్ర‌యాత్నానికి మ‌ద్ద‌తు ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌ట్లు ట్వీట్‌లో పేర్కొంది. అయితే బీటౌన్ తార‌లు, జాన్వీ క‌పూర్‌, దిశా ప‌టాని, టైగ‌ర్ ష్రాఫ్‌తోపాటు మ‌రికొంత మంది ఇటీవ‌ల వెకేష‌న్‌కు మాల్దీవుల‌కు వెళ్లొచ్చారు. రణబీర్ కపూర్, అలియా భట్ కూడా కోవిడ్ -19 నుంచి కోలుకున్న వెంటనే మాల్దీవులు చుట్టొచ్చారు. అక్క‌డ దిగిన ఫోటోల‌ను సైతం సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లో పోస్టు చేశారు.

మాల్దీవుల ప్రకటన అనంత‌రం బాలీవుడ్ సెల‌బ్రిటీల‌పై నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో మండిప‌డుతున్నారు. ఫ‌న్నీ మీమ్స్‌తో‌ నెటిజ‌న్లు జోకులు పేల్చుతున్నారు. ‌ ఓ వైపు  దేశ‌మంతా క‌రోనాతో ప్ర‌జ‌లు అల్లాడుతుంటే బాలీవుడ్ సెల‌బ్రిటీలు మాత్రం త‌మ‌ వినోదాల కోసం హాలీడే ట్రిప్పుల పేరుతో ఎంజాయ్ చేస్తున్నార‌ని విరుచుకుప‌డుతున్నారు. దేశం తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే ట్రిప్పులు క‌వాల్సి వ‌చ్చిందా అని విమ‌ర్శిస్తున్నారు. ఇండియా టూరిస్టుల‌ను మాల్దీవులు బ్యాన్ చేయ‌డం మంచిప‌ని అయ్యిందంటూ సంబ‌ర‌ప‌డుతున్నారు.

చ‌ద‌వండి: ‘తిండి లేక అల్లాడుతుంటే.. డ‌బ్బులు నీళ్ల‌లా ఖ‌ర్చుపెడుతున్నారు’
క‌రోనా బాధితుల‌కే క‌రువైందంటే.. చేపలకు ఆక్సిజన్‌! 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు