మా అత్తగారికి బాయ్‌ ఫ్రెండ్‌ కావాలి, కండీషన్స్‌ అప్లై

21 Jul, 2021 12:22 IST|Sakshi

సాధారణంగా ఉద్యోగాలు, స్థలాల అమ్మకాల కోసం ప్రకటనలు ఇస్తుంటారు. అయితే ఓ యువతి ఏకంగా బాయ్‌ ఫ్రెండ్‌ కావాలంటూ ప్రకటన ఇచ్చింది. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే ఆ ప్రకటన తన కోసం కాదట వారి అత్త గారి కోసమని తెలిపింది. కాకపోతే ఇందులో కొన్ని కండీషన్స్‌ కూడా ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ వింత ప్రకటన ఓ రేంజ్‌లో నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. 

ఆ  ప్రకటనలో ఏముంది.. ఆ కండీషన్స్‌ ఏంటి!
న్యూయార్క్‌లోని హడ్సన్ వ్యాలీకి చెందిన ఓ కోడలు తన అత్తగారికి బాయ్ ఫ్రెండ్ కావాలని తెలుపుతూ.. అందుకు సదరు వ్యక్తికి అర్హతలుగా 40 నుంచి 60 ఏళ్ల , వీటితో పాటు డ్యాన్స్ వచ్చుండాలని, చక్కని మాటకారిగా ఉండాలని పేర్కొంది. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. కేవలం రెండు రోజులకు మాత్రమే ఆ వ్యక్తి తన అత్తగారికి బాయ్ ఫ్రెండ్‌గా వ్యవహరిస్తే సరిపోతుందని కూడా ఈ ప్రకటనలో వెల్లడించింది. అందుకు గాను సుమారు 960 డాలర్లు( సుమారు రూ. 72000) చెల్లించనున్నట్లు తెలిపింది.  దీని వెనుక అసలు కారణం ఏమిటంటే..  తాము ఓ స్నేహితురాలి వివాహానికి హాజరుకావాల్సి ఉందని, అక్కడ తన అత్తగారు బోర్‌గా ఫీల్‌ కాకూడదనే ఉద్దేశ్యంతో ఓ బాయ్ ఫ్రెండ్‌ను ఆమెకు తోడుగా తీసుకెళ్లాలనుకుంటున్నట్లు ఆ కోడలు తెలిపింది.

రెండు రోజులకు సుమారు వెయ్యి డాలర్లు అంటే మంచి ఆఫరే కాబట్టి దీనికి చాలా మంది అప్లై కూడా చేసుకుంటున్నారట. వీరి నుంచి వాళ్ల  అత్తకు ఓ  బాయ్‌ ఫ్రెండ్‌ను ఎలా సెలక్ట్ చేస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది. ఈ ప్రకటన ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ గా మారి హల్‌ చల్‌ చేస్తుంది. దీనిపై నెటిజన్లు కొందరు ఇలాంటి ప్రకటనలు కూడా ఉంటాయా అని నవ్వుతుంటే మరి కొందరు ఇదంతా పబ్లిసిటీ స్టంట్‌ అంటు కొట్టి పారేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు