అరెరే ఎంతపనాయే.. బెడిసికొట్టిన వెడ్డింగ్‌ ఫోటోషూట్‌.. ఫోటోలు వైరల్‌

4 Jan, 2022 17:40 IST|Sakshi

ప్రస్తుత కాలంలో ఫోటో షూట్‌లు సర్వసాధారణం అయిపోయాయి. వివాహాలు, పుట్టినరోజు, ఫంక్షన్లు ఇలా ఏ వేడుక అయినా ఫోటోషూట్‌ మరింత అందాన్ని తీసుకొస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలోని మధుర క్షణాలను భవిష్యత్తులో జ్జాపకంగా మలుచుకునేందుకు ఏకైక మార్గం ఫోటోలు, వీడియోలే.. ముఖ్యంగా ప్రతి జంట పెళ్లికి ముందు వెడ్డింగ్‌ షూట్‌లు నిర్వహించుకుంటున్నారు, మంచి లొకేషన్‌, క్యాస్టూమ్స్‌తో ఫోటోలు, వీడియోలకు రెడీ అవుతున్నారు. తాజాగా కజకిస్థాన్‌కు చెందిన ఓ జంట ఇలాగే ఆలోచించి వెడ్డింగ్‌షూట్‌ ఏర్పాటు చేసుకున్నారు. అయితే అద్భుతంగా ఊహించుకున్న వీరి ఫోటో షూట్‌ అంతే లెవల్‌లో బెడిసికొట్టింది.

అసలేం జరిగిందంటే.. మురత్ జురాయేవ్, కమిల్లా అనే వధూవరులు పెళ్లి దుస్తుల్లో అందంగా ముస్తాబై ఫోటోషూట్‌ కోసం అవుట్‌డోర్‌ లొకేషన్‌కు వెళ్లారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ సూట్‌లో కెమెరాకు పోజులిస్తుండగా.. ప్రమాదవశాత్తూ కాలుజారి బురద గుంటలో పడిపోయారు. దీంతో వధువు తెలుపు రంగు గౌన్‌ అంతా బురదతో నిండిపోయింది. ఇక ఇక చేసేందేం లేక జరిగింది తల్చుకొని నవ్వూతూ అక్కడి నుంచి తిరగొచ్చేశారు.
చదవండి: వైరల్‌: ఫోటోలో చిరుత ఎక్కడుందో గుర్తుపట్టండి.. కష్టంగా ఉందా?

అయితే బురదలో పడిన దృశ్యాలను సైతం వెడ్డింగ్‌ ఫోటోగ్రాఫర్‌ తన కెమెరాలో బంధించాడు. వీటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. వీటిని చూస్తుంటే అనుకోకుండా బురదలో పడినట్లుగా కనిపించడం లేదు. కావాలనే బురదలో తీసుకున్నట్లు ఎంతో చక్కగా ఉన్నాయి. బురదలో పడిన సమయంలో ఇద్దరి ముఖాల్లో హావాభావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. 
చదవండి: రాకాసి పీత!.. గోల్ఫ్‌ స్టిక్‌ని చెకోడీలు విరిచినట్లు పటపట విరిచేసింది!

 

A post shared by 𝐀𝐒𝐊𝐀𝐑 𝐁𝐔𝐌𝐀𝐆𝐀 (@bumagaz)

మరిన్ని వార్తలు