వింత పెళ్లి; అతనికి 52.. ఆమెకు 20.. ప్రేమ ఎలా చిగురించిందంటే..

2 Nov, 2022 16:01 IST|Sakshi

ప్రేమ మనుషుల జీవితాలనే మార్చేస్తుంది. ఎప్పుడు, ఎవరిని తన వైపు లాగుతుందో చెప్పడం అసాధ్యం. కొందరి లవ్‌ స్టోరీలు వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. తాజాగా పెళ్లికి వయసుతో సంబంధం లేదని నిరూపించింది ఓ జంట. తండ్రి వయసున్న వ్యక్తిని ఓ యువతి మనువాడింది. ఊహించుకోవడానికి కొంచెం కష్టంగా ఉన్నఈ వార్త అక్షర సత్యం. ఈ వింత పెళ్లి పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది.

20 ఏళ్ల యువతి 52 ఏళ్ల ఓ టీచర్‌ను వివాహం చేసుకుంది. అయితే వయసులో యువతి కంటే అతను 32 ఏళ్లు పెద్దవాడు కావడం విశేషం. అంతేగాక వ్యక్తి అద్భుత వ్యక్తిత్వానికి ఫిదా అయి అతనితో ప్రేమలో పడినట్లు చెబుతోంది. వీళ్లిద్దరూ ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఈ పెళ్లి విషయం ప్రపంచానికి తెలిసింది. జోయా నూర్‌ అనే యువతి డిగ్రీ చదువుతోంది. ఈ క్రమంలో తన టీచర్‌ సాజీద్‌ అలీతో ప్రేమలో పడింది.

ఇంకేమంది వెంటనే తన ప్రేమ విషయాన్ని ఉపాధ్యాయుడికి తెలియజేయగా అతను సున్నితంగా తిరస్కరించాడు. దీనికి ఇద్దరి మధ్య 32 ఏళ్ల వ్యత్యాసం ఉండటమే కారణమట. తర్వాత ఆమె పట్టువదలని విక్రమార్కుడిలా తన పప్రేమ కోసం పోరాటం చేసింది.  యువతి ప్రేమకు మంత్రముగ్దుడైన వ్యక్తి ఆమెకు పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కాకపోతే ఒకవారం సమయం కావాలని కోరాడు. చివరికి యువతితో పెళ్లికి పచ్చజెండా ఊపాడు.
చదవండి: ఏకంగా 87 పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తి... మరొసారి మాజీ భార్యతో ....

ఈలోగా జోయా తన పప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయగా వాళ్లు  ససేమిరా అన్నారు. అయినప్పటికీ తల్లిదండ్రులను కాదని ఆమె సాజిద్‌ను పెళ్లి చేసుకుంది. జోయా అద్భుతంగా వంట చేస్తుందని, ఆమె వండే ఆహారం తెగ ఇష్టమని సాజిద్‌ తెలిపాడు. అంతేగాక ఆమె చేసే టీకి తాను అభిమానినని చెప్పాడు. ప్రస్తుతం వీళ్ల లవ్‌స్టోరి నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీరికి మద్దతుగా నిలుస్తూ కొత్త జంటపై నెటిజన్లు ప్రేమను కురిపిస్తున్నారు. 

మరిన్ని వార్తలు